Breaking News

జిల్లాలో 1283 మందికి బంగారు కొండ కిట్స్ పంపిణీ

-బాలమిత్రాలకు ప్రత్యేక అభినందనలు
-కలెక్టర్ మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన “బంగారుకొండ” కార్యక్రమం సమర్థవంతంగా అమలులో అడుగులు వేయడం జరిగిందని కలెక్టర్ కె. మాధవీలత పేర్కొన్నారు.శుక్రవారం స్థానిక కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో ఐసిడీఎస్, డి ఆర్ డి ఎ, ఆడిట్ అధికారుల తో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, బలహీనంగా ఉన్న, వయస్సు కు తగ్గ బరువు, బరువుకు తగ్గ ఎత్తు లేని 1283 మంది పిల్లలను గుర్తించి వారికి బాలమిత్ర ల ద్వారా బంగారు కొండ కిట్స్ పంపిణీ చేసే కార్యక్రమాన్ని తొలి వారం సమర్థవంతంగా అమలు చేయడం జరిగిందన్నారు. ఈమేరకు బాలమిత్ర ల భాగస్వామ్యం, చోరవను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు.తొలివారం క్షేత్ర స్థాయి లో బుధవారం బాలమిత్ర లు దత్తత తీసుకున్న చిన్నారుల ఇంటికి వెళ్ళి అవగాహన కల్పించడం తో పాటు బంగారు కొండ కిట్ ద్వారా అందచేస్తున్న పోషక విలువలతో కూడిన పదార్ధాలు ఖచ్చితంగా పిల్లలకు ఇవ్వడం ద్వారా క్రమ పెరుగుదల, పిల్లల్లో వికాసముపై అవగాహన కల్పించడం ద్వారా చురుకైన పాత్ర పోషించడం, వారితో మమేకం అవ్వడం జరిగిందన్నారు . మొత్తం ఆరు నెలల పాటు బాలమిత్ర ఆయా గృహాలను సందర్శించాలన్నారు. ప్రతి బుధవారం రోజు సందర్శించి పిల్లల్లో జరుగుతున్న ఎదుగుదల పై , హెల్త్ సూచిక కార్డు వివరాలపై అవగాహన కల్పించే భాధ్యత తీసుకోవాలన్నారు.ఇకపై ప్రతి నెలా జిల్లా బలహీనతగా ఉన్న పిల్లలను గుర్తించే ప్రక్రియ కొనసాగిస్తూ, వారి కోసం స్వచ్ఛంద గా ముందుకు వచ్చే బాలమిత్రలు నమోదు చేయాల్సి ఉంటుందని కలెక్టర్ తెలిపారు.బంగారు కొండ కింద బాలమిత్ర లుగా రూ.3000 వేలు చెల్లించిన వారి పేరుతో ధృవపత్రం ఇవ్వడం జరుగుతుందని మాధవీలత తెలిపారు. ప్రతినెలా పిల్లలకు నిర్దుష్టమైన తేదీల్లో కిట్స్ పంపిణీ చేయడం జరగాలని అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో అధికారుల మధ్య సమన్వయం సాధించడం ముఖ్యం అన్నారు. ప్రతి బుధవారం బాలమిత్రాలు చిన్నారుల ఇంటి సందర్శన కు వెళ్ళే క్రమంలో ముందు రోజు ఆ సమాచారాన్ని చిన్నారుల తల్లితండ్రులకు తెలియ చెయ్యలని పేర్కొన్నారు.ఈ సమావేశంలో జిల్లా స్త్రీ శిశు సంక్షేమ అధికారి కె. విజయ కుమారి, డి ఆర్ డి ఎ పిడి ఎస్. సుభాషిణి, డి ఈ వో ఎస్. అబ్రహం, డి ఎస్ వో ఎ. కుమార్, జిల్లా ఆడిట్ అధికారి సరస్వతి, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *