రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త :
శనివారం రాత్రి జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా వాంబే కాలనీ, నారాయణపురంలో సచివాలయం నెం 3, 4 పర్యటించి కొన్ని ఇళ్ల కు సంబందించి డేటా సేకరణ వివరాలు పరిశీలించారు.ఈ సందర్భంగా జేసీ తేజ్ భరత్ మాట్లాడుతూ, జగనన్న సురక్ష ద్వారా అర్హులు ఎవరైనా మిగిలి ఉంటే వారి వివరాలు సేకరించాలని ఆదేశించారు. ఇప్పటి వరకు ప్రతి ఒక్కరికీ వారి అర్హత మేరకు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న, ఇంకా కొద్ది మంది తమకు పథకాలు అమలు కావడం లేదని అర్జీలు ఇవ్వడం జరుగుతోందని అన్నారు. ఆక్రమంలో ప్రస్తుతం జూన్ 30 వరకు క్షేత్ర స్థాయి లో వాలంటీర్లు పర్యటన చేసి, వారికి భరోసా కల్పించాలన్నారు.
Prajavartha Online Telugu News