విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గంధం సునీత వారి ఆధ్వర్యంలో “స్పెషల్ జువెనైల్ పోలీస్ యూనిట్, చైల్డ్ వెల్ఫేర్ పోలీస్ ఆఫీసర్స్, జువెనైల్ జస్టిస్ బోర్డు మరియు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులకు” జువెనైల్ జస్టిస్ (కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రెన్) ఆక్ట్, 2015 పై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.చట్టంతో విబేధించిన బాలల విషయంలో వివిధ శాఖల అధికారులు పాటించాల్సిన నిబంధనలు ఈ యాక్ట్ స్పష్టం చేస్తుందని, సంబంధిత అధికారులు ఈ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు. చట్టంతో విబేధించిన బాలలలో పరివర్తన తీసుకురావాల్సిన బాధ్యత అందరి పైన ఉందని, ఈ క్రమంలో చాలా సున్నితంగా, స్నేహాపూర్వకంగా వారితో వ్యవహరించాలని తెలియజేశారు.ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జ్ ఎస్. ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ చట్టంచే విబేధించిన బాలల విషయంలో పోలీసు అధికారులు, జువెనైల్ జస్టిస్ బోర్డ్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీల పాత్ర గురించి వివరించారు. జువెనైల్ జస్టిస్ ఆక్ట్, 2015 ప్రకారం పాటించాల్సిన నిబంధాలు అతిక్రమణకు చట్ట పరంగా కఠినమైన శిక్షలు విధించబడునని తెలియజేశారు.జువెనైల్ జస్టిస్ ఆక్ట్ లోని 7, 10, 13, 14, 15, 20, 23 సెక్షన్ల పై స్పష్టమైన అవగాహన కల్పించారు. చట్టంతో విబేధించిన బాలలకు ఉచిత న్యాయ సేవలు అందించబడతాయని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీమతి. కె. ప్రత్యూష కుమారి తెలిపారు. ఎలాంటి న్యాయ సందేహాలు ఉన్నా జిల్లా న్యాయ సేవాధికార సంస్థని సంప్రదించాలని కోరారు.ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు, పోలీస్ అధికారులు, జువెనైల్ జస్టిస్ బోర్డ్ సభ్యులు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News