-ప్రాంతాల వారీగా మట్టి నమూనాల సేకరణ
-జగనన్న సురక్ష కార్యక్రమం లో సిసిఆర్సి కార్డుల కై సర్వే
– ఆఫ్ లైన్ ద్వారా కొనుగోలు చేసిన ధాన్యం ఆన్లైన్ లో నమోదు చేసి చెల్లింపులు జరుపుతున్నాం
-జేసీ ఎన్. తేజ్ భరత్
రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా లో ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకుండా ఖరీఫ్ సీజన్ లో ప్రాంతాల వారీగా గత మూడు ఏళ్ల గా రైతులకు సరఫరా చేసిన గన్ని బ్యాగులకి అనుగుణంగా ఆర్భికే ల పరిధిలో ధాన్యం సేకరణ చేపట్టడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత తెలిపారు.ఖరీఫ్ సీజన్లో అన్ని కొనుగోలు కేంద్రాల వద్ద అవసరమైన నూరు శాతం గన్ని బ్యాగులను అందుబాటులో ఉంచి సేకరణ చెయ్యడం జరుగుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ స్పష్టం చేశారు.శనివారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశంనకు ముఖ్య అతిథిగా జాయింట్ కలెక్టర్ , జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్ పర్సన్ బూరుగుపల్లి సుబ్బారావు, డిసిసిబి చైర్మన్ ఆకుల వీర్రాజు లు హాజరయ్యారు.ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్ . తేజ్ భరత్ మాట్లాడుతూ, మాట్లాడుతూ, ఖరీఫ్ సేకరణ కోసం సాగు నుంచి కొనుగోలు చేసే వరకు రైతులు నుంచి వచ్చిన సూచనలనీ పరిగణన లోకి తీసుకోవడం, రైతులకు అవసరమైన ఎరువులు ఆయా అర్భికెల వద్ద సిద్దం చేసేలా వ్యవసాయ, మార్కెటింగ్ అధికారులతో కూడి కార్యాచరణ అమలు చేస్తామన్నారు. జిల్లాలో రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు, సాగునీటి విడుదల చెయ్యడంతో పాటు, పండించిన ధాన్యం కొనుగోలుకి ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో చర్యలు తీసుకోవాలని అన్నారు.సమావేశంలో భాగంగా సిసిఆర్ సి కార్డు లను జగనన్న సురక్ష కింద ఇంటింటి సర్వే సమయంలో నమోదు చేసి, గ్రామ సభలో అందించడం జరుగుతుందన్నారు. జిల్లాలో 66 వేల సిసిఆర్ సి కార్డు లు లక్ష్యంకాగా ఇప్పటి వరకు 40 శాతం పూర్తి చేశారని, మిగిలిన వాటిని రెవెన్యూ, వ్యవసాయ శాఖ లతో సమన్వయం చేస్తూ, జగనన్న సురక్ష కార్యక్రమం లో పూర్తి చేస్తామన్నారు. రైతులు సహకరించాలని కోరారు.డ్రోన్ సాంకేతిక వినియోగాన్ని అభివృద్ధి పరచే దిశలో రైతులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నట్లు తేజ్ భరత్ తెలిపారు. సుమారు రూ.40 వేలకు పైగా ఖర్చు అయ్యే శిక్షణ ఉచితంగా అందిస్తున్నామని, ఐదుగురు సభ్యులు కలిసి ముందుకు రావాలని, వారిలో ఒకరు కనీసం ఇంటర్ విద్యా అర్హత కలిగి ఉండాలన్నారు. రైతులు ముందస్తుగా పంటలు వేసేలా, డ్రోన్ పై శిక్షణ కోసం రైతు గ్రూపులను గుర్తించాలని సమావేశంలో తీర్మానం చేశారు. ఈ సీజన్ లో జిల్లాలో యూరియా, డి ఎ పి, తదితర ఎరువులు 58536 మెట్రిక్ టన్నుల అవసకాగా, 19424 మెట్రిక్ టన్నుల సిద్దం చేసి, 8478 ఏం టి లు అమ్మకాలు చేసినట్లు తెలిపారు.డిసిసిబి చైర్మన్ ఆకుల వీర్రాజు ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వం అని, రైతు భరోసా నుంచి ఇన్పుట్ సబ్సిడీ వరకు ఎన్నో పథకాలు అమలు చేయడం జరుగుతోందని అన్నారు. కౌలు రైతులకు సహకార బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు కు కృషి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్ పర్సన్ బూరుగుపల్లి సుబ్బారావు మాట్లాడుతూ రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం రైతు పనిచేస్తోందని, డ్రోన్ పై పరిజ్ఞానం ఉచితంగా అందిస్తున్న దృష్ట్యా మండల, అర్భికే పరిధిలో గ్రూపు లను గుర్తించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వ్యవసాయ సలహా మండలి మండల సమావేశంలో ఆమేరకు రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఐతే ఖరీఫ్ సీజన్ లో అవసరమైన ధాన్యం బస్తాలు , ఎరువులు ముందస్తుగా అర్భికెలలో అందుబాటు లో ఉంచాలని తెలిపారు.తొలుత సమావేశంలో భాగంగా ఖరీఫ్ సీజన్ లో ధాన్యం సాగు, నీటి సరఫరా, విత్తనాలు, ఎరువుల అందుబాటు, ఈ కేవైసి, పశు సంవర్ధక, ఉద్యానవన ఫామాయిల్, కోకో పంటలు సాగు విస్తీర్ణం పెంచే దిశలో చేపడుతున్న పథకాలు పై, జలవనరుల శాఖ, మైక్రో ఇరిగేషన్ తదితర అనుబంధ శాఖల అధికారులతో రైతులు పలు అంశాలపై చర్చించారు.సమావేశంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యులు కంటే తేజా, జి. జనార్ధన రావు, ఆదర్శ రైతులు ఎం.నరసింహారావు, డి. రామకృష్ణ, పీ. శ్రీనివాసరావు, సత్యనారాయణ, వ్యవసాయ అధికారి ఎస్. మాధవ రావు, ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త ఎమ్. నంద కిషోర్, ఇతర వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు హార్టికల్చర్ అధికారి వి.రాధాకృష్ణ, ప్రాజెక్ట్ డైరెక్టర్ (మైక్రో ఇరిగేషన్) కే .స్వాతి , జెడి (మత్స్య) కృష్ణా రావు, డి వి హెచ్ వి ఎస్టీజి సత్య గోవింద్, ఇతర అధికారులు, పలువురు రైతులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News