Breaking News

వాలంటీర్ లు వారి పరిధిలోని ప్రతీ ఒక్క గృహాన్ని సందర్శించి సమస్యలు తెలుసుకోవాలి

– గ్రామ సభ నిర్వహించే తేదీని ముందుగా ప్రజలకు తెలియ చెయ్యాలి
-కలెక్టర్ మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ప్రయోజనం కలుగచేసేలా ఇంటింటి సర్వే లో లబ్ధిదారుల నుంచి సమగ్ర డేటా సేకరించాల్సి ఉంటుందని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత ఆదేశించారు.శనివారం సాయంత్రం రాజవోలు గ్రామంలో జగనన్న సురక్ష గృహ సందర్శన కార్యక్రమాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ సందర్భంలో ప్రజలతో, వాలంటీర్లు తో ముఖాముఖి సంభాషించారు .ఈ సందర్భంగా కలెక్టర్ డా కె. మాధవీలత మాట్లాడుతూ, ప్రజలకు అందచేసే పౌర సేవల కోసం నిబద్దత, జవాబుదారీ తనం కలిగి ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడం జరిగిందని న్నారు. ఆ క్రమంలో స్పందన, జగనన్నకు చెబుదాం (1902) తీసుకుని రావడం జరిగిందని అన్నారు. ఆ క్రమంలో ఈ ఒక్క అర్హత ఉన్న లబ్దిదారులకు పథకాలు అమలు కాకుండా ఉండరాదన్నది ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి ఆశయం అన్నారు.ఆ నేపథ్యంలో జగనన్న సురక్ష కార్యక్రమం చేపట్టడం జరుగుతోందని కలెక్టర్ మాధవీలత తెలియ చేశారు. జూన్ 24 నుంచి 30 వరకు మీ పరిధిలో ఉన్న ప్రతి ఇంటింటి కి వెళ్లి వారికి ప్రభుత్వ పరంగా అందుతున్న పథకాలు వివరాలు నమోదు చేసి, వారి ఫొటో క్యాప్చర్ చేయాలని తెలిపారు. అదే సమయంలో ఇంకా ప్రభుత్వ పరంగా ఏదైనా పథకం అర్హత ఉండి పొంది ఉండక పోతే అందుకు సంబందించిన రికార్డులను సేకరించాలని, వాలంటీర్, గ్రామ కార్యదర్సులు ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. లబ్ధిదారులకు జనన, మరణ, వివాహ, తదితర దృవపత్రాలు జారీ తో పాటు, సచివాలయ వ్యవస్థ ద్వారా అందిస్తున్న సుమారు 550 పైగా సేవలు అందించాల్సి ఉంటుందన్నారు. జగనన్న సురక్ష సమయంలో ప్రజలు కోరే 11 రకాల సేవలు ఉచితంగా ఎటువంటి రుసుము వసూలు చెయ్యకుండా అందించాల్సి ఉంటుందని, ప్రజలకు అవగాహన కలుగ చెయ్యాలని అన్నారు. జూలై ఒకటి నుంచి 23 వరకు రోజు విడిచి రోజు మండలంలో ఉన్న గ్రామాలకు చెందిన గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుందని ఆ రోజున అర్జి దారులకు ధ్రువ పత్రం అందించడం ద్వారా మెరుగైన పౌర సేవలు అందించి పనితీరు చూపాలని తెలియచేశారు. కలెక్టర్ సమక్షంలో అర్జిదారును నుంచి ధరకాస్తు తీసుకుని ట్యాబ్ ద్వారా నమోదు చెయ్యడం జరిగింది. రేషన్ కార్డు కుటుంబ సభ్యులు విడదీసి విడి విడిగా కార్డు జారీ, సామాజిక భద్రత తదితర అర్జీలను పరిష్కారం చేసేందుకు అవసరమైన డాక్యు మెంట్లు తీసుకుని పరిష్కారం చెయ్యాలని అన్నారు.కలెక్టర్ వెంట రాజమహేంద్రవరం రూరల్ మండల ప్రత్యేక అధికారి , డి టి డబ్ల్యూ వో కె.. జ్యోతి, సచివాలయ సిబ్బంది వాలంటీర్లు పాల్గొన్నారు .

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *