Breaking News

జగనన్న సురక్ష కింద జిల్లా వ్యాప్తంగా ఉన్న

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
512 గ్రామ వార్డు పరిధిలోని 6,51,189 గృహాలను వాలంటీర్లు , గృహ సారథులు సందర్శించే విధంగా జూన్ 24 నుంచి 30 వరకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసి, క్షేత్ర స్థాయిలో డేటా సేకరణ ప్రారంభించడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత తెలియచేశారు.గురువారం ఉదయం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే ఎస్ జవహర్ రెడ్డి వెలగపూడి నుంచి వీడియో కాన్ఫరెన్స్  ద్వారా కలెక్టర్ లతో జగనన్న సురక్ష, రీ సర్వే, జె కె సి, ప్రాధాన్యత భవనాలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ, జగనన్న సురక్ష ద్వారా అర్హులైన లబ్ధిదారులను గుర్తించి ఆయా పథకాలు అమలు చేయడం కోసం ఖచ్చితత్వం తో కూడిన పని తీరు చూపాల్సి ఉంటుందన్నారు. శాఖల మధ్య సమన్వయం సాధించడం ద్వారా జగనన్న సురక్ష కింద వొచ్చే అర్జీలను పరిష్కారం చెయ్యడంతో పాటు గ్రామ సభ ఏ రోజు నిర్వహిస్తున్నామో ఆయా గ్రామాల్లో ముందస్తు సమాచారం ఇవ్వడం తో పాటు ప్రజాప్రతినిధులతో కూడి నిర్వహించాలన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలు మేరకు గ్రామ సభలో అర్జీదారులు కోరిన ధ్రువపత్రాలు అందచెయ్యల్సి ఉంటుందన్నారు.జిల్లా కలెక్టర్ కె. మాధవీలత ఇప్పటికే మండల పరిధిలో డివిజన్, నియోజకవర్గ, మండల స్థాయి ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో  శిక్షణ తో కూడిన అవగాహన కలుగ చేసినట్లు జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత తెలిపారు.  జిల్లాలోని 512 గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని సచివాలయాలకి చెందిన 3,937 సచివాలయ కార్యదర్శులు, 8,933 మంది వాలంటీర్లకు రూటు మ్యాప్ మేరకు ఇంటింటి సర్వే ప్రారంభించా మన్నారు.జగనన్న భూ హక్కు మరియు భూ రక్షా పథకం కింద 272 రెవెన్యూ గ్రామాల్లో 2449.75 చరదపు కిలోమీటర్ల మేర సర్వే చేపట్టవలసి ఉండగా, రెండో పేజ్ లో 10 గ్రామాల్లో 12, 998 స్టోన్ ప్లాంటేషన్ గాను 11,360 ప్లాంటేషన్ పూర్తి చేశామన్నారు. జిల్లాలో 215 గ్రామాల్లో సర్వే చేపట్టడం జరిగిందన్నారు. 52 గ్రామాల్లో, 3 పట్టణ ప్రాంతాల్లో డ్రోన్ సర్వే నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.ప్రాధాన్యత భవనాలు కింద జిల్లాలో 1101 భవన నిర్మాణ పనులకు గాను 800 భవనాలు పూర్తిచేశామని, 113 పూర్తి చేసే దశలో , 169 పురోగతిలో ఉన్నట్లు మాధవీలత తెలిపారు.  390 సచివాలయ భవనాలకు గాను 328 భవనాలు, 373 అర్భికే లకు గాను 268 భవనాలు, 338 వైయస్ఆర్ హెల్త్ క్లినిక్స్ కు గానూ 204 భవనాలు పూర్తి చేసినట్లు తెలిపారు.జగనన్న కు చెబుదాం కింద మే 9 నుంచి జూన్ 23 వరకు 2551 అర్జీలు రాగా 1827 పరిష్కారం చేసినట్లు కలెక్టర్ మాధవీలత వివరించారు.  శాఖల వారీగా పంచాయతీ రాజ్ 458, పోలీస్ 405, విద్యుత్ 333, రెవెన్యూ 321, హౌసింగ్ 180 అర్జీలు రావడం జరిగిందన్నారు. జగనన్న సురక్ష కార్యక్రమం లో భాగంగా సంబంధిత అర్జి దారులను కలిసి అర్జి పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని క్షేత్ర స్థాయి అధికారులకు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలియచేశారు.ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, డి ఆర్వో జి. నరసింహులు, ఆర్డీవో లు ఎస్. మల్లి బాబు, ఎ. చైత్ర వర్షిణి,  స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (ఎల్ ఏ) టిఇఎం రాజు, ఇతర జిల్లా అధికారులు  పిఆర్ ఎస్ ఈ ఏబివి ప్రసాద్, ఆర్ డబ్ల్యుఎస్ ఎస్ ఈ డి. బాల శంకర్,  సిపివో  ఏ. ముఖ లింగం,  డిపివో  జేవీఎస్ సత్యనారాయణ, డి ఎం హెచ్ వో  డా. కె. వేంకటేశ్వర రావు,   డిఎల్ఎస్వో పి  లక్ష్మణ రావు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *