Breaking News

బుధవారం సాయంత్రం తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కే..మాధవీలత వారి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది.

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా పరిధిలో గుర్తించబడిన ఆరు ఓపెన్ ఇసుక రీచ్ లకు 1). తీపర్రు, 2).పెండ్యాల-కానూరు, 3).పెండ్యాల, 4).కుమారదేవం, 5).చిడిపి-II & 6) చిడిపి-III జిల్లా కమిటీ ఆమోదం తెలియచేస్తూ అందుకు అనుగుణంగా మైనింగ్ ప్లాన్, పర్యవరణ అనుమతులు పొందవలసినదిగా ఆదేశించడమైనదని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత తెలియ చేశారు. కమిటీ సమావేశంలో భాగంగా ఇటీవల రివర్ కంజర్వేటర్ వారు ఆగస్ట్ 31 వరకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ జారీచేసిన డిసిల్టేషన్ రీచ్లు (బోట్మెన్ సొసీటీలు ద్వారా ఇసుక తీయుట) కొవ్వూరు డివిజన్ నందు 11 ర్యాంపు పాయింట్లు , రాజమహేంద్రవరం డివిజన్ నందు 24 ర్యాంపు పాయింట్లు నకు జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నందు ఆమోదం తెలిపియున్నట్లు పేర్కొన్నారు.రాబోయే వర్షా కాలం నందు ఇసుక కొరత లేకుండా ప్రస్తుతం ఉన్న 8 స్టాక్ పాయింట్ల లో నిల్వ ఉంచిన 8,63,923 మెట్రిక్ టన్నులు ఇసుక అధనంగా 50% అనగా మిగులు 5,00,000 మెట్రిక్ టన్నులు గౄహ అవసరాల నిమిత్తం నిల్వ చెయ్యాలని అధికారులను ఆదేశించడమైనదని తెలియ చేశారు.నాడు-నేడు పనులు, ప్రభుత్వ ప్రాధాన్యత పనులకు ఇసుక కొరత లేకుండా సరఫరా చేయవలసిందిగా జయప్రకాష్ పవర్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారిని కమిటీ ఆదేశించడమైనది.గోపాలపురం నియోజకవర్గం నల్లజెర్ల మండలంలో స్థానిక అవసరాలు మరియు గౄహ నిర్మాణం నిమిత్తం ఇసుకను 3వ ఆర్డర్ స్ట్రీం నుండి తీసుకొనుటకు జిల్లా స్థాయి కమిటీ ఈ సందర్భంగా ఆమోదించి యున్నట్లు అధికారులు తెలియ చేశారు. గతంలో మునికూడలి , కాటవరం పరిధి సీతానగరం మండలంలో సీజ్ చేసిన ఇసుక నిల్వలను రాజమహేంద్రవరం లోని అర్భన్ హౌసింగ్ స్కీం లో వాడుక నిమిత్తం సంబందిత ఫైల్ తదుపరి ఆదేశాల కొరకు కలెక్టర్ వారికి సమర్పిచవలసినదిగా కమిటీ లో నిర్ణయించడమైనది. ఇసుక అక్రమ రవాణా నిరోదించుటకు జిల్లా స్థాయిలో ఉన్న విజిలెన్స్ స్కాడ్ మరియు ఎస్.ఇ.బి. వారిని తరచుగా తనిఖీలు నిర్వహించ వలసినదిగా కమిటీ సంభందిత సమన్వయ శాఖల అధికారులను ఆదేశించినారు. హైకోర్టు ఆదేశాల అనుసారం, రాజమహేంద్రవరం ఆల్కట్ గార్డెన్స్ డిసిల్టేషన్ రీచ్ నిలుపుదలపై ఫిర్యాదు దారుల అభ్యంతరాలను పరిగణలోనికి తీసుకున్న తరువాయి రివర్ కంజర్వేటర్ రిపోర్ట్ ను పరిశీలీంచి తదుపరి నిర్ణయం తీసుకొనుటకు కమిటీ ఆమోదించటమైనది.ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, జిల్లా మైన్స్ అధికారి ఎమ్. సుబ్రహ్మణ్యం, ఆర్డీవో ఎస్. మల్లి బాబు, డిడి భూగర్భ జలాలు వై.శ్రీనివాస్, పోలీస్, సెబ్, డిపివో, రవాణా, ఈ ఈ గోదావరీ వాటర్ హెడ్స్, పర్యావరణ, మైన్స్ అధికారులు, జెపి వెంచర్స్ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *