Breaking News

బ్యాటరీ తో నడిచే ట్రై సైకిల్లు మంజూరు కలెక్టర్ హామీ

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా కలెక్టర్ కె మాధవీలత కొవ్వూరు మండలం ఐ పంగిడి గ్రామంలో శనివారం ఏర్పాటు చేసిన రైతు దినోత్సవం, వైయస్సార్ ఉచిత పంటల బీమా పంపిణీ కార్యక్రమంలో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి విచ్చేశారు.ఈ సందర్భంగా ఐ పంగిడి గ్రామం జాంపేట నివాసి కూనిశెట్టి నాగేశ్వరరావు జిల్లా కలెక్టర్ ను కలిసి తాను వికలాంగుడునని, ఇంటింటికి తిరిగి కూరగాయలు అమ్ముకోవడానికి తన వద్దనున్న ట్రై సైకిల్ పూర్తిగా పాడై పోయిందని, తన వ్యాపారం చేసుకునేందుకు వీలుగా బ్యాటరీ ద్వారా నడిచే ట్రై సైకిల్ ను ప్రభుత్వం ద్వారా మంజూరు చేయాలని నేరుగా జిల్లా కలెక్టర్ కు విన్నవించారు.జిల్లా కలెక్టర్ డా. కే మాధవీలత స్పందించి రెండు మూడు రోజుల్లో బ్యాటరీ తో నడిచే ట్రై సైకిల్ మంజూరు చేసి అందిస్తామని నాగేశ్వరరావుకు హామీ ఇచ్చారు.జిల్లా కలెక్టర్ వెంట జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ భరత్, ఆర్డీవో ఎస్ మల్లిబాబు, వివిధ జిల్లా అధికారులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *