-అనపర్తి మండలం కూతుకులూరు గ్రామంలో
-జిల్లా కలెక్టర్ డా. కే. మాధవీలత
-అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం ఎంతో ఆనందాన్ని ఇస్తోంది.. ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి
అనపర్తి, నేటి పత్రిక ప్రజావార్త :
పాలనా వికేంద్రీకారణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల వద్దకే పాలనను అందిస్తున్నదని అందులో భాగంగానే వాలంటీర్, సచివాలయ వ్యవస్థ లను ప్రారంభించి గ్రామాల్లో ప్రజల ఇంటి వద్దకే వచ్చి అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలను అందజేస్తున్నట్లు కలెక్టర్ డా. మాధవీలత పేర్కొన్నారు.శనివారం అనపర్తి మండలం గ్రామంలో 79 లక్షల వ్యయం తొ నిర్మించిన గ్రామ సచివాలయం, ఆర్బీకే, విలేజ్ క్లినిక్స్ లను శాసనసభ్యులు సూర్యనారాయణ రెడ్డి తో కలిసి ప్రారంభోత్సవము చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కలెక్టర్ డా. కే. మాధవీలతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ గ్రామీణ ప్రాంత ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పించే విధంగా గ్రామాల్లోనే వైయస్సార్ హెల్త్ క్లినిక్ ఏర్పాటు చేయడంతో పాటు ఏఎన్ఎం లో డాక్టర్లు ఇంటింటికి సర్వే నిర్వహిస్తూ ప్రజల ఆరోగ్య స్థితిగతులను తెలుసుకుంటున్నా రన్నారు. అదేవిధంగా గ్రామాల్లోనే పరిపాలన అందించే దిశగా గ్రామ ప్రజల సమస్యల సత్వర పరిష్కారానికి గాను సచివాలయాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా రైతు సంక్షేమాన్ని కోరుతూ నాణ్యమైన ఎరువులు విత్తనాలు వ్యవసాయ మెలకువలు రైతులుకు అందుబాటులో ఉండి అందించే దిశగా ఆర్.బి.కె కేంద్రాలను గ్రామాల్లోని ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు ప్రయోజనాలను పూర్తిస్థాయిలో అందించే దిశగా జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా అర్హులైన వారందరికీ 11 రకాల సేవలను ఉచితంగా ప్రభుత్వం అందిస్తుంది అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.కుతుకులూరు గ్రామ ప్రజలందరూ తమ గ్రామంలో ఉన్న సచివాలయం, ఆర్.బి.కె, విలేజ్ హెల్త్ క్లినిక్ సేవలను వినియోగించు కోవాలని ఆమె కోరారు.జిల్లాకు కలెక్టర్ గా వచ్చిన తరువాత బలబద్రపురంలో రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి తొలిసారిగా పర్యటించారని, ఆ పర్యటన శాసనసభ్యులతొ కలసి సీఎంను నియోజకవర్గ ప్రజలకు ఇళ్ల స్థలాలను అడగడం జరిగిందన్నారు. సీఎం గారి ఆదేశాలు ఐదు వేల మందికి ఇళ్లస్థల పట్టాలు అందించేందుకు భూ సేకరణ జరిగిందని, త్వరలో లబ్ధిదారులకు అందించనున్నా మని కలెక్టర్ తెలిపారు.అనపర్తి శాసనసభ్యులు సత్తి సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ వైఎస్. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టిన నాటి నుంచి పేదప్రజల సమగ్ర , ఆర్ధిక అభివృద్దే లక్ష్యంగా పని చేస్తున్నారన్నారు. అర్హులైన వారందరికీ సంక్షేమం పథకాల ప్రయోజనాలను అందిస్తున్నా రన్నారు. నేడు కుతుకులూరు గ్రామంలో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, విలేజ్ క్లినిక్ ను ప్రారంభించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని శాసనసభ్యులు సూర్యనారాయణ రెడ్డి పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో 65 ఏళ్ళు ఉంటేనే గాని సామాజిక భద్రత పెన్షన్ వచ్చేది కాదని నేడు 60 సంవత్సరాలకే ఫించన్ అందిస్తున్నామన్నారు. తల్లి తండ్రులపై ఆర్ధిక భారం పడకుండా ప్రతి పేద విద్యార్థి ఉన్నత చదువులు చదువుకోనేందుకు అమ్మఒడి, విద్యాకానుక, ఫీజు రియంబర్స్ మెంట్ ద్వారా చదువుకునే అవకాశం కల్పిస్తూ ఒక మేనమామ లా అన్ని విధాలా ఆదుకుని ప్రోత్సహం ఇస్తున్నట్లు పేర్కొన్నారు.వైయస్ఆర్ ఆసరా లో బాగంగా డ్వాక్రా గ్రూపులకు మూడు విడతులు గా రుణమాఫీ, అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల వ్యాపారాభివృద్ధికి చేదోడు కింద రూ.18,750/- లు ఆర్ధిక సహాయాన్ని అందిస్తున్నా మన్నారు. పుట్టిన ప్రతి బిడ్డ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా వుండాలన్న లక్ష్యంతో వైఎస్సార్ సంపూర్ణ , వైయస్ఆర్ సంపూర్ణ ప్లస్ పోషకాహార పధకాన్ని అమలు చేస్తున్నారన్నారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా రైతు భరోసా తొ పాటు ప్రతి గ్రామంలో రైతులకు అందుబాటులో ఆర్ బీ కే లను ఏర్పాటు చేసి రైతులు నాణ్యమైన ఎరువులు, పురుగుమందులు సకాలంలో అందుస్తున్నామన్నారు.కార్యక్రమంలో రాష్ట్ర రెడ్డి కార్పొరేషన్ డైరెక్టర్ సత్తి రామకృష్ణారెడ్డి (రాంబాబు) భట్రాజు కార్పొరేషన్ డైరెక్టర్ చిట్టి రాజు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి, జడ్పిటిసి సత్తి గీతా వరలక్ష్మి వెంకటరెడ్డి, ఎంపీపీ సూర్యనారాయణ, మండల వ్యవసాయ సలహా మండలి చైర్మన్ పడాల శ్రీనివాసరెడ్డి, వైస్ ఎంపీపీ పడాల బుల్లి రెడ్డి,వైకాపా నాయకులు కొవ్వూ రి సత్యనారాయణ రెడ్డి సత్తిబాబు ఎండిఓ మహేశ్వరి, కార్యదర్శి రామకృష్ణ, పలువురు నాయకులు అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News