రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాజమహేంద్రవరం లో ఈ విద్య సంవత్సరం నుంచే మెడికల్ అడ్మిషన్లు ప్రారంభించే క్రమంలో నూతనం వైద్య కళాశాల నిర్మాణ పనులను పరిశీలించడం జరిగిందని రాష్ట్ర స్పెషల్ చీఫ్ సెక్రటరీ (వైద్య ఆరోగ్య ) ఎంటి. కృష్ణబాబు అన్నారుశనివారం స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు నూతనంగా నిర్మాణంలో ఉన్న మెడికల్ కళాశాల భవన నిర్మాణ పనులను అధికారులతో పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య కళాశాల భవన నిర్మాణ పనులు జులై 15 నాటికి పూర్తి కావాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మౌలిక సదుపాయాలు కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. క్లాసు రూమ్లలో ఏసి సౌకర్యం ఉన్నప్పటికీ తగినన్ని ఫ్యాన్లను వేయాలని, అదేవిధంగా బెంచీల సంఖ్యను కూడా పెంచాలని, గదులు అన్నిటిని పరిశీలించి ప్రతి విషయంలోనూ తీసుకోవలసిన చర్యల పై తగిన సూచనలు సలహాలు ఇవ్వడం జరిగిందన్నారు. వైద్య కళాశాలకు కావలసిన వైద్య పరికరాలను త్వరగా తీసుకుని ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
అదేవిధంగా భవన నిర్మాణానికి వాడిన మెటీరియల్ వాటి నాణ్యత విషయం అడిగి తెలుసుకున్నారు. భవనం గదులు నిర్మించినప్పుడు ప్రతి విభాగానికి సంబంధించిన హెచ్వోడీలతో (HOD) మాట్లాడి వారి సూచనల మేరకు ఆయా గదులలో సదుపాయాలు కల్పించాలని తెలియజేశారు . భవన నిర్మాణ పనులు పరిశీలనలో భాగంగా వుడ్ వర్క్స్, ఎలక్ట్రిఫికేషన్, అప్రోచ్ రోడ్డు వంటి పనులు , సానిటరీ వర్క్స్ త్వరగా కంప్లీట్ చేయాలని తెలియజేశారు.ఒక గదిని తాత్కాలికంగా వైద్య కళాశాల హెచ్వోడీలతో సమావేశాలు నిర్వహించుకునే విధంగా రౌండ్ టేబుల్ ఏర్పాటు చేయాలని తెలియజేశారు.అదేవిధంగా అన్ని విభాగములకు సరిపడిన ప్రొఫెసర్సు మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్లు వివరాలను వైద్య కళాశాల ప్రిన్సిపల్ డా. సౌభాగ్య లక్ష్మి ని అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె.వెంకటేశ్వరరావు, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సౌభాగ్య లక్ష్మి, డాక్టర్ కే.. సాయికిరణ్, ఫాథలాజి అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. నజీర్ ఇతర విభాగాల అధిపతులు, ఇతర వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News