Breaking News

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు పంపిణీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పేద ప్రజలకు అన్ని విధాలా అండగా ఉంటున్న ఏకైక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమే అని తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జీ దేవినేని అవినాష్ అన్నారు..పేదవారికి అరోగ్యద్వారా వైద్యం అందని పక్షంలో సీఎంఆర్ఎఫ్ ద్వారా సహాయం చేస్తున్నామని తెలిపారు.. మ్యానిఫెస్టోలో ఇచ్చిన ప్రతీ హామీ అమలు చేసిన ఘనత సీఎం జగన్ సొంతమని అయన పేర్కొన్నారు.ఒకపక్క వైస్సార్సీపీ ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్యం కోసం కోట్ల రూపాయలు నిధులు ఖర్చు పెడుతుంటే ఆరోగ్య నిధులు నిలిపేశారు అని ప్రతిపక్షాలు వారి అనుకూల మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారని అది వాస్తవం కాదని అన్నారు. తూర్పు నియోజకవర్గంలో టీడిపి నేతలు ప్రభుత్వం పై విష ప్రచారం చేయటమే పనిగా పెట్టుకున్నారు అని,వారి మాయ మాటలు నమ్మే పరిస్థితి లో ప్రజలు లేరు అయన విమర్శించారు.గుణదల లోని వైసీపీ తూర్పు నియోజకవర్గం కార్యాలయంలో 16వ డివిజన్ కి చెందిన బొల్లు విజయలక్ష్మి ముఖ్యమంత్రి సహయనిధి కింద 52,000/- రూపాయలు చెక్కును నియోజకవర్గ ఇంచార్జి దేవినేని అవినాష్ అందజేశారు…ఈ సంధర్బంగా అవినాష్ మాట్లాడుతు నియోజకవర్గ వ్యాప్తంగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఇప్పటికే కోట్లాది రూపాయలు అందచేసినట్లు అవినాష్ చెప్పారు. ఈ కార్యక్రమంలో 16వ డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడిశెట్టి బహదూర్ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *