జగనన్న సురక్ష కార్యక్రమంతో సమస్యల తక్షణ పరిష్కారం:దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలకు తక్షణ పరిష్కారం లభించడంతో పాటు వారికి అవసరమైన ధ్రువీకరణ పత్రాలు కేవలము ఒక్కరోజులో నే అందిస్తున్నామని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. సోమవారం 7,19,20,21 డివిజన్ లకి సంబంధించిన 85,86,87,89,90,99,102,104, 105 సచివాలయలకు జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమంలో అవినాష్ ముఖ్య అతిథిగా పాల్గొని ఆయా సచివలయాల పరిధిలో 2103 మందికి మంజూరు అయిన వివిధ రకాల ధ్రువీకరణ పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజల వద్దకు పాలన చేరువ చేసిన ఘనత మన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారిదే అని కొనియాడారు. గతంలో ఏదైనా ధ్రువీకరణ పత్రం కావాలంటే కార్యాలయాల చుట్టూ కళ్ళారిగెల తిరిగి లంచాలు ఇస్తే గాని ఎప్పటికో వచ్చేవి కావని, కానీ నేడు జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా వలంటీర్ లే ఇంటి వద్దకు వచ్చి అర్జీలు స్వీకరించి కేవలం ఒక్కరోజు లోనే అవసరమైన పత్రాలు అందజేయడం మంచి పరిణామం అని అన్నారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా కరోన విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి వలంటీర్ లు పనిచేస్తే ప్రతిపక్ష పార్టీలు వారిని కించపరిచే విధంగా మాట్లాడటం సిగ్గుచేటు అని విమర్శించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ ప్రాజెక్ట్స్ సత్యవతి, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,7వ డివిజన్ కార్పొరేటర్,స్టాండింగ్ కమిటీ మెంబెర్ మెరకనపల్లి మాధురి,21వ డివిజన్ కార్పొరేటర్ పుప్పాల కుమారి,కో,ఆప్షన్ సభ్యులు అలీమ్,జోనల్ కమిషనర్లు రవి చంద్,కృష్ణ మరియు వి.ఎమ్.సి అధికారులు, వైస్సార్సీపీ ముఖ్య నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

సీసీఎల్ఏలో స్ట్రక్చర్డ్ ల్యాండ్ బ్యాంక్ పోర్టల్

-ఎస్సీలకు కలిగే ప్రయోజనాలను బుడగ జంగాలకూ వర్తింప చేయండి -ప్రణాళిక ప్రకారం కలెక్టర్లు అభివృద్ది కార్యక్రమాలు చేపట్టాలి -కలెక్టర్ల సదస్సులో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *