Breaking News

ప్రజల నుంచి వచ్చిన అర్జీలను సత్వరమే నాణ్యతతో పరిష్కరించాలని రెవిన్యూ డివిజనల్ అధికారిణి ఎ. చైత్రవర్షిణి అన్నారు.

 

రాజమహేంద్రవరం,నేటి పత్రిక ప్రజావార్త :
సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన స్పందనలో రెవిన్యూ డివిజనల్ అధికారిణి ఎ. చైత్రవర్షిణి పాల్గొని ఫిర్యాదుదారుల నుంచి అర్జీలని స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజలనుంచి పౌర సరఫరాలు, మున్సిపాలిటీ, పోలీస్, హౌసింగ్, అమ్మఒడి, త్రాగునీరు, భూఅక్రమణ, ఇండ్ల స్థలాలు,ఉపాధి, భూ సర్వే తదితర అంశాలకు సంబంధించి పన్నెండు మంది నుంచి అర్జీలను స్వీకరించా మన్నారు.ప్రజాసమస్యలు సులభంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం స్పందన, జేకేసి, ఇప్పుడు జగనన్న సురక్ష ద్వారా స్పష్టమైన పనితీరు తో అర్జిల్ని స్వీకరిస్తున్నారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కె.ఆర్.సి. డివిజన్ తహసీల్దార్ ఎ. శ్రీనివాస రావు, ఆర్డీవో కార్యాలయ పరిపాలన అధికారి జిఎఎల్ఎస్. దేవి, వైద్య, ఆరోగ్య, ఆర్.డబ్ల్యూఎస్, లేబర్, కోఆపరేటివ్ , ఫైర్, డిఆర్ డిఎ , ఎపిఎస్ఆర్టీసీ , డివిజనల్ పంచాయతీ అధికారి, డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ , ఏపీడబ్ల్యూపీ , ఇరిగేషన్, ఐసిడిఎస్, పశుసంవర్ధక, పరిశ్రమలు, తదితర డివిజన్ స్థాయి అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మెగా డీఎస్సీ–2025లో టెట్ అర్హతలు, స్పోర్ట్స్ సర్టిఫికెట్లపై సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలు అవాస్తవం

-స్పోర్ట్స్ డీఎస్సీ అభ్యర్థులపై వచ్చిన ఆరోపణలకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్, శాప్ మేనేజింగ్ డైరెక్టర్ వివరణ అమరావతి, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *