Breaking News

ఇళ్ల రిజిస్ట్రేషన్లలో ఆటంకం లేకుండా చర్యలు

-ఇళ్ల రిజిస్ట్రేషన్లలో ఆటంకం లేకుండా చర్యలు
-కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కొత్త బిల్డింగ్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన వాంబే కాలనీ పధకం రిజిస్ట్రేషన్ గృహాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ల కౌంటర్లను సోమవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. జేఎన్ ఎన్ యూఆర్ఎం పథకం కింద కేటాయించిన గృహాల రిజిస్ట్రేషన్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడాలన్నారు.7,210 ఇళ్లను ప్రభుత్వం పేదలకు కేటాయించిన ఇళ్ల రిజిస్ట్రేషన్లలో ఎటువంటి ఆటంకాలు కలగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్ అధికారులు, సిబ్బందికి సూచించారు. ప్రజలు ఎదురుకుంటున్న సమస్యల గురించి లబ్దిదారులకు అందుబాటులో ఉండే విధంగా అధికారులు మరియు సిబ్బంది వారి యొక్క సమస్యలను పరిష్కరించాలని ఆదేశాలను జారిచేశారు.రిజిస్ట్రేషన్లకు సంబంధించి చెల్లించవలసిన ఫీజుల వసూళ్ళ కౌంటర్, డాక్యుమెంట్ కౌంటర్, EKYC కౌంటర్లను పరిశీలించి ఎక్కడ కూడా లబ్దిదారులు ఇబ్బందిపడకుండా చూడాలన్నారు. తక్కువ కాలవ్యవధిలో ఇళ్ల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జరగాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమములో సిటీ ప్లానర్ జి.వి.జి.ఎస్.వి ప్రసాద్, జాయింట్ డైరెక్టర్ (అమృత్) డా.కె.బి.ఎన్.ఎస్ లతా, మేనేజర్ బి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి… : ప్రభుత్వ విప్ బొండా ఉమామహేశ్వరరావు

-భక్తిశ్రద్ధలతో గణపతి మహోత్సవాలు నిర్వహిస్తున్న ప్రజలకు కూటమి ప్రభుత్వం సంపూర్ణ సహకారం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *