Breaking News

కూడలిని చుట్టూ సుందరంగా తీర్చిదిద్దండి

 

-స్వరాజ్య మైదానంలో అంబేడ్కర్ శృతివనంలో జరుగుతున్న పనుల నాణ్యత పరిశీలన
-మిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గారు ఐ.ఏ.ఎస్‌.

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సోమవారం క్షేత్ర స్థాయిలో కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గారు ఐ.ఏ.ఎస్. PWD గ్రౌండ్స్ చుట్టూ ఉన్న ప్రదేశాలను, ఫూట్ పాత్ లను, డివెడర్స్ ను మరింత అందంగా తీర్చిదిద్దడానికి అధికారులతో కలిసి పర్యవేక్షించి PWD గ్రౌండ్స్ కూడలిని చుట్టూ సుందరంగా బ్యూటిఫికేషన్ చేయాలనీ సంబంధిత అధికారులకు పలు ఆదేశాలు జారీచేసారు. అదేవిధంగా అంబేద్కర్ స్మృతివనం స్వరాజ్య మైదానంలో ఎంతో అద్భుతంగా నిర్మాణం జరుగుతున్న అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులను పరిశీలించిన కమిషనర్.అదే విధముగా అంబేద్కర్ స్మృతివనం ఆవరణలో గల వర్షపునీటిని గుంటలను పరిశీలించి యుద్దప్రాతిపదిక చర్యలు చేపట్టి వర్షపునీటిని డ్రెయిన్ లకు మళ్ళించాలని ఆదేశించారు. అవసరమైన చోట్ల మోటార్లు ఏర్పాటు చేసి ఎక్కడ వర్షపు నీరు నిల్వలు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు.ఈ సందర్భములో జరుగుచున్న నిర్మాణ పనులను పరిశీలించి నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పనులు నిర్వహించాలని క్వాలిటి కంట్రోల్ అధికారులను ఆదేశించారు. కారిడార్ మొత్తంలో గ్రానైట్ ఫుట్ ఫాత్, ల్యాండ్ స్కెఫ్,కాంపౌండ్ వాల్ నిర్మాణాన్ని పరిశీలించిన కమిషనర్ అన్ని భాగాలు కలిపి చాలా జాగ్రత్తగా విగ్రహ నిర్మాణం చేయాలని ఆదేశించారు.స్టెయిన్‌లెస్ స్టీల్ ఆర్మేచర్ ఫ్రేమ్‌వర్క్ తరువాత ఇన్‌స్టాల్ చేయబడే భాగాలను కార్మికులు ప్యాచ్ చేస్తున్నారు. అలాగే సంబంధించిన పనులు నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ ప్రాంగంణంలో అందమైన రకరకాల పూలు, ఆకర్షణీయమైన మొక్కలతో గ్రీనరీ ఏర్పాటు చేయనున్నారు.ఈ (డిప్యూటీ సిటి ప్లానర్ ప్లానింగ్) జుబిన్ శిరన్ రాయ్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏ.ఎస్.ఎన్ ప్రసాద్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

 

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *