-యువ ఓటర్లు ప్లస్ 18 ఓటర్లు స్వచ్ఛందంగా ముందుకు రావాలి
-అక్టోబర్ 1, జనవరి 1, ఏప్రిల్ 1, జూలై 1
– ఓటర్ల ధృవీకరణ లో రాజకీయ పార్టీలు భాగస్వామ్యం కావాలి
-“https://ceoandhra.nic.in” వెబ్సైట్ లో నమోదుకు అవకాశం
– కలెక్టర్ మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఓటరు నమోదు కార్యక్రమం లో రాజకీయ పార్టీ లచే గుర్తించబడిన బూత్ స్థాయి సహాయకులు బి ఎల్ వో తో కలిసి ఇంటింటి కి వెళ్ళే ఓటరు ధృవీకరణ ప్రక్రియలో పాలుపంచుకోవాలని జిల్లా ఎన్నికల ఓటరు నమోదు అధికారి, జిల్లా కలెక్టర్ డా కె.. మాధవీలత విజ్ఞప్తి చేశారు.గురువారం ఉదయం కలెక్టరేట్ లో “స్పెషల్ సమ్మరీ రివిజన్ 2024” పై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా స్థాయిలో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, ఎస్ ఎస్ ఆర్ 2023 కు చెందిన ఓటర్ల సవరణ తుది జాబితా ది.05.01.2023 ప్రచురించడమైనదని తెలిపారు. ప్రస్తుతం ఎస్ ఎస్ ఆర్ 2024 ప్రక్రియ లో భాగంగా బి ఎల్ ఓ ల వారీగా అన్ని రాజకీయ పార్టీలకు అన్ని పోలింగ్ స్టేషన్ లకు సంబందించిన ఓటర్ల తుది జాబితా అందజేయడమైనదని అన్నారు.
ఇకపై నియోజక వర్గ స్థాయి లో ప్రతి మంగళవారం, జిల్లా స్థాయి లో ప్రతి బుధవారం రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఆమేరకు పూర్తి స్థాయి లో సహకారం అందించి ఓటరు నమోదు కార్యక్రమం 0ఎస్ ఎస్ ఆర్ 2024 ను విజయవంతం చేయాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరూ తప్పని సరిగా ఓటుహక్కు కలిగి ఉండే విధంగా అవగాహన కోసం రాజకీయ పార్టీలు ముందుకు రావాలని కోరారు. 17 సంవత్సరాలు ఉన్న వారు గతంలో ప్రతి సంవత్సరం ఓటర్ల నమోదుకు రెండు సార్లు చేసే వారని, నాలుగు సార్లు జనవరి 1 వ తేదీ, ఏప్రిల్ 1 వ తేదీ, జులై 1వ తేదీ మరియు అక్టోబర్ 1 వ తేదీలలో పేర్లు నమోదు కి అవకాశం ఉందని మాధవీలత తెలిపారు. ఎస్ ఎస్ ఆర్ 2024 సంబంధించి రెండు అర్హత తేదీలు సవరణ చేసియున్నారని .ఈ రెండు సవరణ లలో చేర్పులు, తొలగుంపులు మరియు మార్పులు చేయడమైనదని పేర్కొన్నారు. రాజకీయ పార్టీల కోసం సవరణ జాబితాలను “https://ceoandhra.nic.in” వెబ్ సైట్ నందు పొందు పరిచి ఉన్నందున, డౌన్లోడ్ చేసుకోవచ్చునని తెలియ చేశారు .షెడ్యూల్ ప్రకారం తేదీ 21.07.2023 నుండి 21.08.2023 వరకు ప్రతి ఇంటికి బూత్ స్థాయి అధికారులు వెళ్లి వెరిఫికేషన్ చేయుట మరియు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి గుర్తించి వారిని ఓటర్లు గా నమోదు చేయుట మరియు 17 సంవత్సరాలు నిండిన వారి వివరములు సేకరించుట మరియు చనిపోయిన, డోర్ నెంబర్ నందు శాశ్వతంగా లేరు వారిని ఓటర్ల జాబితా నుండి తొలగించి, సవరణ చేయడం జరుగుతుందన్నారు. ఈ ధృవీకరణ లో భాగంగా ఒక ఇంటి నెంబర్ లో 10 ఓటర్లకు మించి ఎక్కువగా వున్న ఓటర్లను మరియు తప్పుగా ఉన్న ఓటర్లను ఫారం-8 ద్వారా సవరణ చేయడం జరుగుతుందన్నారు.ఇందులో భాగంగా రాజాకీయ పార్టీల వారు నియమించుకున్న బూత్ స్థాయి సహాయకులను, ఒక బి ఎల్ ఓ లతో పాటు ప్రతి ఇంటికి ఒకరిని మాత్రమే పంపవలెనని స్పష్టం చేశారు. ఇతరులు BLO తో పాటు వెళ్ళడానికి వీలులేదు.రాజకీయ పార్టిలు వారు పాటించవలిసిన మార్గదర్శకాలు పై ఆయా రాజకీయ పార్టీలకు అందచెయ్యడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. బి ఎల్ ఏ జాబితాను కలెక్టర్ వారి కార్యాలయనుకు అంద జేయ వలసిందిగా కలెక్టర్ కోరారు. ఆ జాబితాను నియోజక వర్గాల వారీగా బి ఎల్ వో లకు అనుసంధానం చేస్తామన్నారు.సామూహికంగా చేర్పులు/ తొలగింపులు/ మార్పులుకు సంబంధించి బల్క్(ఎక్కువ మొత్తంలో) అప్లికేషన్స్ తీసుకోబడవని కలెక్టర్ మాధవీలత పేర్కొన్నారు. ఒకే డోర్ నెంబర్ తో 10 ప్లస్ మందికి మించిన ఉన్న ఓటర్లు ఉన్నట్లు మీ దృష్టికి వొస్తే తెలుపగలరని, అదే విధంగా 100 సంవత్సరములు వయస్సు పై బడిన ఓటర్ల వివరాలు అందించాల్సి ఉంటుందన్నారు.పోలింగ్ స్టేషన్ పరిధిలో రాష్ట్ర స్థాయి ఓటర్ టర్న్ ఔట్ శాతం (80.38%) కంటే తక్కువ ఓటర్ టర్న్ ఔట్ వుందో అక్కడ రాబోవు ఎలక్షన్స్ నందు ఓటర్ టర్న్ ఔట్ శాతం పెంచుటకు తగు సూచనలు, మీ సహకారము రాజకీయ పార్టీలు నుంచి కోరడమైనదని అన్నారు.ఎస్ ఎస్ ఆర్ – 2024 పూర్తి అయ్యేంతరుకు ప్రతి మంగళవారం అసెంబ్లీ నియోజకవర్గం నందు , ప్రతి బుధవారం జిల్లా స్థాయి లో సంబందించిన ఎలెక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి(ERO)చే గుర్తుంపు పొందిన రాజకీయ పార్టి ప్రతినిధులతో సమావేశము జరపబడునని జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ పేర్కొన్నారు..సదరు మీటింగ్స్ కు హాజరు అయి మీ యొక్క సహాయ సహకారాలు మరియు సూచనలు అందిoచవలిసినదిగా కోరడమైనది.ఈ ప్రక్రియలో భాగస్వామ్యం అవ్వడం ద్వారా అత్యంత పారదర్శకంగా ఓటరు జాబితా సవరణ సాధ్యం అవుతుందని, 2024 సాధారణ ఎన్నికల నేపథ్యంలో ప్రతి రాజకీయ పార్టీ భాగస్వామ్యంతో చివరి నిమిషంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవన్నారు.ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, జిల్లా రెవెన్యూ అధికారి జి. నరసింహం, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి డా వై ఏ వేదయార్, వైసిపి పార్టీ ప్రతినిధి యూ పి వర్మ, టిడిపి ప్రతినిధి ఏ. జగదీష్, కలెక్టరేట్ ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News