పెడన (చెన్నూరు), నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ గురువారం పెడన మండలం చెన్నూరు జగనన్న సురక్ష కార్యక్రమాల్లో పాల్గొని లబ్ధిదారులకు ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు, రైస్ కార్డులు అందజేశారు. ఓటిఎస్ పథకం కింద లబ్ధిదారులకు ఇంటి రిజిస్ట్రేషన్ పత్రాలు అందజేస్తూ గ్రామంలో ఓ టి ఎస్ క్రింద 95 మంది లబ్ధి పొందినట్లు, జగనన్న ఆస్తిగా అభివర్ణించారు. ఉత్తమ సేవలందించిన వాలంటీర్లను సత్కరించారు.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ వాలంటీర్లను సచివాలయ సిబ్బందిని ఇంటింటికి పంపించి మీకు ఏం కావాలో అడిగి తెలుసుకుని, మీరు ఏ అధికారుల చుట్టూ తిరగకుండా ఒకే చోట సచివాలయం వద్ద ఒక్క రూపాయి ఖర్చు లేకుండా రైస్ కార్డులు, ఆదాయ, కుల, వివాహ 11 రకాలైన ధ్రువపత్రాలు అందించడానికి జగనన్న సురక్ష కార్యక్రమం అమలు చేస్తున్నట్లు, అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించాలన్న లక్ష్యంతో ఉన్నట్లు మంత్రి తెలిపారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు గురించి మంత్రి తెలియజేస్తూ చెన్నూరు గ్రామంలో 440 మంది అవ్వా తాతలకు వైయస్సార్ భరోసా పెన్షన్లు,87 మంది లబ్ధిదారులకు కాపు నేస్తం, 129 మంది లబ్ధిదారులకు వైయస్సార్ చేయూత, 463 మంది రైతులకు రైతు భరోసా, 117 మందికి అమ్మబడి, 698 మంది డ్వాక్రా మహిళలకు రుణమాఫీతోపాటు వివిధ పథకాల కింద లబ్ధి చేకూర్చినట్లు మంత్రి వివరించారు.
గ్రామంలో గత నాలుగేళ్లుగా వివిధ పథకాల కింద ప్రభుత్వం రు.11.61 కోట్ల రూపాయలు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు.
నాడు నేడు క్రింద పాఠశాలలు అభివృద్ధి పరిచి, ఫీజు రియంబర్స్మెంట్ అందించడం, ఇంగ్లీష్ మీడియం విద్య ప్రవేశ పెట్టడం జరిగిందని అన్నారు. వివిధ పథకాల కింద మధ్య దళారీల ప్రమేయం లేకుండా, అవినీతికి తావు లేకుండా , ముఖ్యమంత్రి బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాలలో జమ చేయడం జరుగుచున్నదని అన్నారు. ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తు పేదల కళ్ళల్లో చిరునవ్వు చూడాలని భావించే జగనన్నకు మద్దతు తెలపాలన్నారు.
ఈ కార్యక్రమంలో పెడన ఎంపీపి రాజులపాటి వాణి, పెడన ఏఎంసీ చైర్ పర్సన్ చారుమతి రామానాయుడు, ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ కారుమంచి కామేశ్వరరావు, తాసిల్దారు మధుసూదన రావు, ఎండిఓ రెడ్డయ్య, వైస్ ఎంపీపీ వై. వరప్రసాద్, ఎంపీటీసీ కాటం నాగమణి, సచివాలయాల కన్వీనర్ బి నాగబాబు, మండల కన్వీనర్ కే నాగబాబు, పలువురు పార్టీ నాయకులు, స్థానిక నాయకులు మండల అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News