Breaking News

ప్రపంచవ్యాప్తంగా జైనమతం అత్యంత శాంతియుతమైన సమాజంగా పరిగణించబడుతుంది…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :

ప్రపంచవ్యాప్తంగా జైనమతం అత్యంత శాంతియుతమైన సమాజంగా పరిగణించబడుతుందని జిల్లా కలెక్టర్ మాధవీలత పేర్కొన్నారు.స్థానిక కలెక్టర్ కార్యాలయ ఛాంబర్ లో గురువారం  జైన సంఘం అధ్యక్షుడు అశోక్ జైన్ ఆధ్యర్యంలో కలెక్టర్ , జాయింట్ కలెక్టర్ ఎన్.తేజ్ భరత్ లను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ, జిల్లాలో జైన్ లకు సంబంధించి ఎటువంటి శాంతి భద్రతల విషయంలోనైనా జిల్లా యంత్రాంగం తప్పకుండా అండగా నిలవడం జరుగుతుందనీ హామీ ఇచ్చారు. కర్ణాటక లో జరిగిన సంఘటన దురదృష్టకరం అన్నారు.ఈ సందర్భంగా కర్ణాటకలోని బెల్గ్ జిల్లాలో మా జైన సన్యాసిని దారుణంగా హత్య చేయడం మరియు ఈ దారుణ హత్యకు వ్యతిరేకంగా నిరసన తెలియజేయడం, బలపరిచే దోషులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆ క్రమంలో కలిసి తమ ఆవేదనను తెలియ చెయ్యడానికి రావడం జరిగిందని అశోక్ జైన్ పేర్కొన్నారు. మైనారిటీ జైన సంఘం లో ఉన్నప్పటికీ మన దేశం యొక్క ఉత్తమ ప్రయోజనాల కోసం ఎల్లప్పుడూ పని చేస్తుందని తెలిపారు. జైన సన్యాసి మన సమాజానికి ప్రతినిధి మాత్రమే కాదు, అహింసా శాంతి తాదాత్మ్యం జీవించడం మరియు జీవించనివ్వడం వంటి మన విలువలకు జైనులు భారతదేశం ప్రాతినిధ్యం వహిస్తున్నారని అన్నారు. ఈ ఘటన మన ప్రాథమిక విలువ వ్యవస్థపై దాడిని ప్రతిబింబిస్తుందని వినతిని ఇచ్చినట్లు పేర్కొన్నారు.అంతకు ముందుసుమతీనాథ్ వాసుపూజ్య భగవాన్ జైన్ టెంపుల్ పెఢి, సంఘం సభ్యులు కలెక్టర్ ను కలిసి విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *