Breaking News

ప్రభుత్వ శాఖలలో తెలుగు అమలు

– బ్రౌన్ మందిరానికి కలెక్టర్ మాధవీలత హామీ

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా లోని వివిధ ప్రభుత్వ శాఖలలో తెలుగు భాష పరిపాలన భాషగా తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ డా. కె.‌మాధవీలత హామీ ఇచ్చారు.శుక్రవారం ఉదయం సి.పి.బ్రౌన్ మందిరం నిర్వాహకుడు సన్నిధానం శాస్త్రి జిల్లా కలెక్టర్ ని ఆమె చాంబర్ లో కలిసి తెలుగు భాష అమలును నిర్బంధంగా అమలు చేయాలని అభ్యర్ధించగా కలెక్టర్ సానుకూలంగా స్పందించారు.ఈ సందర్భంలో ఆధ్యాత్మిక పక్ష పత్రిక ‘ శ్రీ సన్నిధానం ‘ వార్షిక సంచికను కలెక్టర్ మాధవీలత ఆవిష్కరించారు.ఆదిత్య కళాశాల అధ్యాపకుడు, ఎన్.ఎస్.ఎస్. అధికారి డా.జి.వి.నాగేశ్వర రావుకు సంబంధించిన ‘ ఆదిత్య సేవాస్త్రం’ అభినందన సంచికను కూడా కలెక్టర్ ఆవిష్కరించారు.సి.పి.బ్రౌన్ మందిరం నిర్వాహకుడు సన్నిధానం శాస్త్రి కలెక్టర్ మాధవీలత ను బ్రౌన్ మందిరం తరపున సన్మానించి, జ్ఞాపిక అంద జేశారు. డా. నాగేశ్వర రావు కృతజ్ఞతలు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *