రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త:
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ 2024 పై సమీక్ష సమావేసాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్వహించడం జరుగుతోందని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కె. మాధవీలత తెలియ చేశారు.ఓటర్ల జాబితా సవరణ (స్పెషల్ సమ్మరీ రివిజన్)కు సంబంధించి బుధవారం విశాఖపట్నంలో ప్రవేటు సమావేశ మందిరంలో రాష్ట్రస్థాయి కలెక్టర్ల సదస్సు నిర్వహించగా తొలిరోజు సమావేశానికి సీనియర్ డిప్యూటీ కమిషనర్లు ధరేంద్రశర్మ, నితీష్ వ్యాస్, డిప్యూటీ ఎన్నికల కమిషనర్ హిర్దేశ్‌కుమార్, సీనియర్ ప్రిన్సిపల్ సెక్రటరీ నరేంద్ర బూటోలియా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తదితరులు పాల్గొన్నారు.తొలుత సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ దేవేంద్ర శర్మ, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తదితరులు తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి సమీక్షా సమావేశం ప్రారంభించడం జరిగింది.ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణ కార్యక్రమంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అందరి జిల్లా కలెక్టర్లతో సమీక్షా సమావేశం ను కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తదితరులు పాల్గొనడం జరిగింది.రెండు రోజుల పాటు అన్ని జిల్లాల్లో నిర్వహిస్తున్న ఓటరు జాబితా సవరణ పై కమిషన్ ఇచ్చిన మార్గదర్శకాల అమలు తీరు, క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తదితర అంశాలపై తొలి రోజు సదస్సులో చర్చించడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత ఆ ప్రకటనలో వెల్లడించారు. బుధ, గురు వారం రెండు రోజులు ఈ సమీక్ష జరగనున్న దృష్ట్యా ఓటరు జాబితా పరిశీలన, ఇంటింటి సర్వే ప్రక్రియ కు చెందిన జిల్లా ప్రగతి నివేదికలను వివరించడం జరిగిందని తెలియచేశారు.
Prajavartha Online Telugu News