Breaking News

ఇంటింటి ఓటర్ల సర్వే ప్రక్రియను సజావుగా పూర్తి చేసేందుకు రానున్న 11 రోజులు నిర్దుష్టమైన కార్యాచరణ

 

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఇంటింటి ఓటర్ల సర్వే ప్రక్రియను సజావుగా పూర్తి చేసేందుకు రానున్న 11 రోజులు నిర్దుష్టమైన కార్యాచరణ ప్రణాళిక అమలు చేసి పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు.గురువారం వెలగపూడి నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా ఎస్ ఎస్ ఆర్ – డోర్ టూ డోర్ ఓటర్ల గుర్తింపు పై ప్రగతిపై సమీక్ష చెయ్యగా, స్థానిక కలెక్టరేట్ విసి హలు నుంచి కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, సహాయ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్ రెడ్డి, డి ఆర్వో జి. నరసింహులు, ఈ ఆర్ ఓ లు అనపర్తి – స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (గెయిల్ (ఐ) లిమిటెడ్) ఏబీవీఎస్బి శ్రీనివాస్,  గోపాలపురం – (ఎస్ సి)స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (ఎల్ ఏ) ఓ ఎన్ జి సి, రాజమహేంద్రవరం టిఇఎం రాజు, ఇతర ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, జిల్లాలో ఓటరు నమోదు ప్రక్రియ ను అనుసరించి 0.5 వెర్షన్ మేరకు డేటా ఎంట్రీ చెయ్యడం, అప్లోడ్ చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలో 592415 ఇళ్లకు గాను 296407 ఇళ్ల ఇంటింటి సర్వే పూర్తిచేశా మన్నారు. 6,034 యువ ఓటర్ల, కొత్త ఓటర్ల ను గుర్తించి వారి నుంచి ఫారం 6 లను 5832 స్వీకరించడం జరిగిందన్నారు. ఆవి ఆన్లైన్ లో చేసి ఉండకపోతే ఫారం -8 ద్వారా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. డెత్, షిఫ్టింగ్, 100 ప్లస్ ఓటర్ల వివరాలు, డుప్లికేట్ ఓటర్ల ను కూడా ఇంటింటి సర్వే ద్వారా గుర్తించడం, ఆన్లైన్ లో కొత్త వెర్షన్ 0.5 లో అప్లోడ్ చేస్తున్నట్లు తెలిపారు. ఒకే డోర్ నంబర్ లో 10 కి మించి ఉన్న ఓటర్లకు సంబందించి 82,938 కి చెందిన దాదాపు పూర్తి గుర్తింపు చేసి, ఫారం 8 లో సదరు వివరాలు నమోదు చేస్తున్నట్లు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *