Breaking News

అల్బెండజోల్ డీ వార్మింగ్ మాత్రలు తప్పనిసరిగా వాడాలి

 

-రక్త హీనత ను అధిగమించేందుకు ఆకుకూరలు, ప్రోటీన్స్ కల ఆహారాన్ని తీసుకోవాలి
-మీకోసం సిఎం మంచి పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందిస్తున్నారు
-జిల్లాలో 1750 సంస్థలలో అల్బెండజోల్ మాత్రలు పంపిణీ
-జిల్లా వ్యాప్తంగా సిద్దం చేసిన 3,60,000 మాత్రలు
-ఆరోగ్య సంరక్షణ దిశగా అడుగులు వేద్దాం.. నులి పురుగులు నులిమేద్దాం..
-జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
చిన్నారుల్లో రక్తహీనతను అధిగమించేందుకు తప్పనిసరిగా వైద్యులు సూచించిన అల్బెండజోల్ డీ వార్మింగ్ మాత్రలు వేసుకొని ఆరోగ్యవంతులుగా ఉండాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పిలుపు నిచ్చారు.గురువారం ఉదయం స్థానిక ఆనంద్ నగర్ మునిసిపల్ హై స్కూల్ (జమునా స్కూల్) నందు నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ యుక్త వయస్సు నుండి రక్త హీనత బారిన పడకుండా ఉండాలంటే తప్పని సరిగా నులిపురుగుల నివారణ మాత్రలు అల్బెండజోల్ ను వాడాలని పేర్కొన్నారు. నులిపురుగుల వలన శరీరంలో రక్త హీనత ఏర్పడుతుందన్నారు. పిల్లల్లో అనారోగ్యానికి కారణమయ్యే నులి పురుగుల నివారణ లో భాగంగా 1 నుంచి 19 ఏళ్ల లోపు వయస్సు ఉన్న పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయడం జరుగుతోందన్నారు. జిల్లా వ్యాప్తంగా గుర్తించిన 1750 సంస్థల్లో నులి పురుగు నివారణ టాబ్లెట్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ జగనన్న గోరుముద్ద పథకం ద్వారా విటమిన్స్ సమృద్ధిగా ఉండే మెనూతో కూడిన విధంగా పౌష్టికాహారాన్ని విద్యార్థులకు అందిస్తుందన్నారు. దీంతోపాటు తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడకుండా అమ్మ ఒడి పథకాన్ని అందిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నాడు నేడు ద్వారా పాఠశాలలను ఆధునికరించి మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు జగనన్న విద్యాకానుక కిట్స్ విద్యార్థులకు అందిస్తుందన్నారు. విద్యార్థి దశలో విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ చదువుకోవాలన్నారు. ప్రతి విద్యార్థి ఆరోగ్యంగా ఉన్నప్పుడు చదువుకునేందుకు ఎటువంటి ఆరోగ్య పరమైన సమస్యలు ఉండవని పేర్కొన్నారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం జిల్లాలో నేడు నిర్వహించుకున్నామని, రెండవ విడత ఈ నెల 17 తేదీన నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. ఆల్బెండజోల్ టాబ్లెట్ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా లభ్యమవుతాయని, తల్లిదండ్రులందరూ తమ పిల్లలకు పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆల్బెండజోల్‌ను అందించేలా చూడాలని కోరారు.జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కే వెంకటేశ్వర్రావు మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖ ద్వారా జిల్లా వ్యాప్తంగా ప్రతి ప్రభుత్వ, ప్రవేటు పాఠశాల, కళాశాల విద్యార్థులకు, ఇతర సంస్థలకు ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. నులి పురుగులు ఉన్న పిల్లల్లో రక్తహీనత, పోషకాల లోపం, ఆకలి మందగించడం, బలహీతన, కడుపు నొప్పి, వికారం, వాంతులు, విరేచనాలు, బరువు తగ్గడం లాంటి లక్షణాలు కనిపిస్తాయని పేర్కొన్నారు. అల్బెండో జోల్ మాత్రల తో వీటికి చెక్ పెట్టి ఆరోగ్యం గా ఉండవచ్చునన్నారు.ఆర్బీఎస్కే ప్రోగ్రాం ఆఫీసర్ డా. రాజీవ్ మాట్లాడుతూ పురుగులు మానవ శరీరానికి కావలసిన పోషకాలను తినేస్తాయని, తద్వారా రక్త నష్టం వలన పోషణ, పెరుగుదల కుంటుపడతాయన్నారు. తీవ్రమైన ఇన్ఫెక్షన్ కారణంగా, పిల్లలు తరచుగా అనారోగ్యంతో లేదా వార్మ్ ఇన్ఫెక్షన్లు పిల్లల శారీరక మరియు మానసిక అభివృద్ధిని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయని, ఇది వారిపై దీర్ఘకాలిక ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశం ఉందన్నారు.ఈ కార్యక్రమంలో డియంహెచ్ఓ డా. కె. వెంకటేశ్వరరావు, డిఎల్ఏటీవో డా.వసుంధర, జిల్లా కోఆర్టినేటర్ డీఎస్ఓ డా.టి. రాజీవ్, జిల్లా కోఆర్డినేటర్ డి.సుబ్బారావు, ఎపిడిమాలజిస్ట్ సుధీర్, డిప్యూటీ డిఎంహెచ్ఓ ఎస్.సుధాకర్,డీఈవో ఎస్.అబ్రహ్మం, ఎంహెచ్ఓ డా. వినూత్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ దిలీప్ కుమార్, డీఈఎంఓ సత్యకుమార్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *