Breaking News

ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం లో 28 దరఖాస్తులు.

-స్పందన,జగనన్న సురక్ష ద్వారా వచ్చిన ప్రజల సమస్య లు త్వరిత గతిన పరిష్కరించే విధంగా చర్యలు.
-మునిసిపల్ కమీషనర్,
-కె.దినేశ్ కుమార్.

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యల పరిష్కార వే దిక స్పందన కార్యక్రమంలో 28 దరఖాస్తులు వచ్చాయని ముని సిపల్ కమీషనర్, కె. దినేష్ కు మార్ అన్నారు.సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ముని సిపల్ కమిషనర్ ప్రజలు నుం డి స్పందన అర్జీలు స్వీకరించా రు. ఈ సందర్భం గా దినేష్ కుమార్ మాట్లాడుతూ స్పందన కార్యక్రమం లో వచ్చిన సమ స్యలు త్వరిత గతిన పరిష్క రించే విధంగా చర్యలు తీసు కుంటున్నామన్నారు.అర్హత ఉండి సంక్షేమ పథకాలు అమలు కానీ వారిని జగనన్న సురక్ష ద్వారా గుర్తించి ఆ పథకాలు అమలు చేయడం జరుగుతోందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి సత్వరమే చర్యలు తీసుకోవ టం జరుగుతొందన్నారు.రాజమండ్రి నగరపాలక సంస్థ కార్యాలయంలో విధులు నిర్వ హిస్తున్న పారిశుధ్య కార్మికులు యం. నాగు, యం. సోమాల మ్మ, మాకు 3 నెలలు బట్టి జీ తాలు లేవు, మాకు పని వత్తిడి కూడా బాగా ఎక్కువగా ఉందని తెలియజేయగా దినేష్ కుమార్ వెంటనే స్పందించి ప్రతీ నెల జీ తం వచ్చే విధంగా చూడాలని సంబధిత అధికారులను ఆదే శించారు.ఈ కార్యక్రమంలో అదనపు కమీషనర్ పి యం సత్యవేణి, సిటీ ప్లానర్ వైబీఆర్ చంద్రబోస్, ఇరిగేషన్ సూపరెంటెండెంట్ జి. పాండు రంగారావు, ఇతర మునిసిపల్ అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *