Breaking News

ప్రజల నుంచి వచ్చిన అర్జీలను సత్వరమే నాణ్యతతో పరిష్కరించాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల నుంచి వచ్చిన అర్జీలను సత్వరమే నాణ్యతతో పరిష్కరించాలని రెవిన్యూ డివిజనల్ అధికారిణి ఎ. చైత్రవర్షిణి అన్నారు. సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన స్పందన లో పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా చైత్ర వర్షిణి ప్రజలనుంచి భూఅక్రమణ, రేషన్ కార్డ్స్, త్రాగునీరు, భూ సర్వే , శానిటేషన్, ఇంటిపన్ను, భూసమస్య, స్థలంపట్టా, హౌసింగ్ తదితర అంశాలకు సంబంధిచి ఎనిమిది అర్జీలను స్వీకరించా మన్నారు. సమస్యల పరిష్కారం కొరకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు. ప్రజాసమస్యల పరిష్కారం కొరకు ప్రభుత్వం స్పందన, జేకేసి, ఇప్పుడు జగనన్న సురక్ష ద్వారా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కార్యాలయం పరిపాలన అధికారి జిఎఎల్ఎస్. దేవి, మునిసిపల్ కార్పొరేషన్, డివిజనల్ పంచాయతీ అధికారి, సివిల్ సప్లైస్, ఐసిడిఎస్, బిసి వెల్ఫేర్, హౌసింగ్, ఇరిగేషన్, ఆర్.డబ్ల్యూ.ఎస్, ఫైర్, సాంఘిక సంక్షేమ, వైద్య, ఆరోగ్య, లేబర్, పశుసంవర్ధక, పరిశ్రమలు, డాక్టర్ ఎస్సార్ ఆరోగ్యశ్రీ శాఖ ల డివిజన్ స్థాయి అధికారులు పాల్గొన్నారు.

 

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *