Breaking News

 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పెద్ద ఎత్తున పాల్గొనండి

– జిల్లా ప్రగతి పై 8 శాఖల శకటాల ప్రదర్శన
– వివిధ పాఠశాల విద్యార్థినీ విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన
– కలెక్టర్ మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
77వ భార‌త స్వాతంత్ర్య దినోత్స‌వ వేడుక లను ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఘనంగా నిర్వ‌హిస్తున్న‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ డా. కే మాధవీలత సోమ‌వారం ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.ఉద‌యం 8.55 గంట‌ల నుంచి కార్య‌క్ర‌మాలు ప్రారంభం అవుతాయని పేర్కొన్నారు. ముఖ్య అతిథిగా జిల్లా ఇన్చార్జి మంత్రి బీసీ సంక్షేమం, సమాచార పౌర సంబంధాలు సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి  చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ  జాతీయ ప‌తాక ఆవిష్క‌ర‌ణ చేసి జెండా వందనం చేస్తారని తెలిపారు.అనంత‌రం సంప్ర‌దాయ పోలీసు గౌర‌వ వంద‌న స్వీకరణ, ముఖ్య అతిథి సందేశం, పోలీసు క‌వాతు, ప్ర‌భుత్వ సంక్షేమ కార్య‌క్ర‌మాల స‌మాచారంతో వివిధ ప్ర‌భుత్వ శాఖ‌ల ప్ర‌గ‌తి శ‌క‌టాల ప్ర‌ద‌ర్శ‌న‌, విద్యార్థుల‌తో సాంస్కృతిక ప్ర‌ద‌ర్శ‌న‌లు, ఉత్త‌మ సేవ‌లు అందించిన అధికారులు, సిబ్బందికి ప్ర‌శంసాప‌త్రాల ప్ర‌ధాన కార్య‌క్ర‌మాలు ఉంటాయ‌ని వివ‌రించారు.ఈ వేడుక‌ల‌కు అంద‌రూ ఆహ్వానితులేన‌ని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు .స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పెద్ద ఎత్తున పాల్గొని జాతీయ భావాన్ని చాటాలని అన్నారు. జిల్లా ప్రగతి పై 8 శాఖల శకటాల ప్రదర్శన, వివిధ పాఠశాల విద్యార్థినీ విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *