– ఈరోజు స్పందన లో వచ్చిన అర్జీలు 180.
-జిల్లా కలెక్టర్ కే. మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యల పరిష్కార వేదిక “స్పందన” లో వచ్చిన అర్జీలను నిర్ణీత కాలవ్యవధిలో నాణ్యతతో కూడిన విధంగా పూర్తిస్థాయిలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డా. కే. మాధవీలత పేర్కొన్నారు.సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో నిర్వహించిన స్పందన కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ , జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ లో ఇతర అధికారులతో కలసి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ ఈ రోజు ప్రజల 180 అర్జీలను స్వీకరించామన్నారు. జిల్లాలో స్పందన కార్యక్రమంలో ఆయా శాఖల వారీ వచ్చిన అర్జీలను నాణ్యతతో కూడిన విధంగా పరిష్కరించి అర్జీదారునికి న్యాయం చేయాలని అధికారులు ఆదేశించారు. ప్రతి అర్జీ క్షేత్ర స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి, అర్జీదారుడు సంతృప్తిచెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలన్నారు. పెండింగ్ బియాండ్ ఎస్ఎల్ఏ, రీఓపెనింగ్.. లేకుండా అర్జీదారుడు సంతృప్తి చెందేలా అర్జీలను పరిష్కరించాలన్నారు.జిల్లాలో మంగళవారం జరిగే. 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను అధికారులు విజయవంతం చేయాలని కలెక్టర్ మాధవీ లత అధికారులకు సూచించారు.స్పందనలో వచ్చిన కొన్ని అర్జీలు…రాజమండ్రి రూరల్ మండలం సాటిలైట్ సిటీ కి చెందిన కళాకారులు ఈరోజు లోవరాజు, భవాని లింగం తమ అర్జీలు సాటిలైట్ సిటీ నందు సుమారు కళాకారులు నివసిస్తున్నామని, కళాకారులు ముందస్తు కళా ప్రదర్శనలు, రిహార్సులు చేసుకునేందుకు వీలుగా కమ్యూనిటీ హాల్ నిర్మించాలని వారు తమ అర్జీ లో కోరారు.పెరవలి మండలం నడిపల్లి గ్రామం చెందిన ఆరేపల్లి మురళీకృష్ణ తమ అర్జీలో కొడుకులు, కుమార్తె, కోడలు, గత ఏడాది అక్టోబర్ మాసంలో తనపై హత్యా ప్రయత్నం చేశారని, అప్పుడు ఆస్పత్రిలో కూడా జాయిన్ అయ్యాను. వారి నుండి రక్షణ కల్పించాలని అర్జీలో కోరారు.రాజానగరం మండలం లాలా చెరువు గ్రామ నివాసి పొన్నాడ లక్ష్మి తన అర్జీలో తాను కూలి పని చేసుకొని కుటుంబాన్ని పోషించు కుంటు న్నాను. గతంలో నేను జగనన్న కాలని లో ఇల్లు కావాలని దరఖాస్తు చేసుకొన్నాను. నా అర్హత ను బట్టి నాకు ఇల్లు మంజూరు చేయాలని వారు కోరారు.
Prajavartha Online Telugu News