-“మా భూమి మా దేశం” శిలాఫలకం ఆవిష్కరించిన కలెక్టర్
-స్వంతత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యం కావాలి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతుగా కృషి చేసి మొక్కలు నాటే కార్యక్రమం లో పాల్గొనాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత, పిల్లలు చిన్నప్పటి నుంచి దేశభక్తి పెంపొందించు కోవాలని అన్నారు. మన దేశ సంస్కృతిని భవిష్యత్తు తరాలకు అందించటానికి వివిధ ప్రాంతాల నుంచి మట్టిని, నీరును సేకరించే పవిత్ర కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. తద్వారా మన దేశ ఔనిత్యాన్ని చాటేందుకు ఇది ఒక పవిత్రమైన కార్యంగా ఆమె అభివర్ణించారు. తొలుత జెడ్పీ హై స్కూల్ స్కౌట్ విద్యార్థినిలు మార్చ్ పాస్ట్ నిర్వహించి కలెక్టర్ గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ర్యాలిని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, డి ఆర్వో జి. నరసింహులు, సిబిసి అధికారి కె.రామ మూర్తి, జిల్లా సైనిక్ అధికారి, కెప్టెన్ సత్య ప్రసాద్, డి ఆర్ వో జి. నర్సింహులు, ప్రాజెక్ట్ డైరెక్టర్ (డ్వామా) పి. జగదాంబ, ఇతర జిల్లా అధికారులు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్కౌట్ విద్యార్థిని లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News