Breaking News

అజాదిగా అమృత్ మహోత్సవ కార్యక్రమం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
నా భూమి – నా దేశం కార్యక్రమం ఒక పవిత్రమైన ఉద్దేశ్యం తో అజాదిగా అమృత్ మహోత్సవ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు.సోమవారం ఉదయం కలెక్టరేట్ లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ భారత ప్రభుత్వం మరియు తూర్పు గోదావరి జిల్లా అధికారులు ఆధ్వర్యంలో సంయుక్తంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో “మేరి మట్టి మేరా దేశ్” కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ తో కూడి భవిష్యత్తు తరాలకు స్థిరమైన అభివృద్ధి అందించవలసిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉన్నతమైన ఆశయంతో దేశభక్తి మూడి పడేలా నా భూమి – నా దేశం కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించు కుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంలో దేశం కోసం సేవలు చేస్తున్న సైనికులను, మాజీ సైనికులకు సన్మానించడం ఎంతో ఆత్మ సంతృప్తిని ఇస్తోందని అన్నారు. దేశం ప్రాణాలర్పించిన  ధైర్యవంతులకు నివాళులు అర్పించేందుకు ఇదో చక్కటి వేదికగా పేర్కొన్నారు. పర్యావరణ కాలుష్యము నివారణ కోసం ప్రతి ఒక్కరూ తమ వంతుగా బాధ్యత తీసుకోవాలని కోరారు. దేశ ప్రగతికి, అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. నా భూమి మరియు నా దేశం యొక్క కలలు రెండింటినీ పోషించాలనే వారి నిబద్ధతను సూచిస్తూ, పాల్గొనేవారు మొక్కలు నాటడంతో ఈ భావన మరింత ప్రతిధ్వనించింది. అత్యున్నత త్యాగానికి గుర్తింపుగా ప్రతి ఇంటికి త్రివర్ణాన్ని ఎగురవేయాలని కలెక్టర్ పిలుపు నిచ్చారు.జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ మాట్లాడుతూ, దేశంలోని అమరవీరులైన ధైర్య సాహసాలు ప్రదర్శించే సైనికులను గౌరవించాలని “మేరీ మట్టి మేరా దేశ్” కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి పిలుపు నిచ్చారని పేర్కొన్నారు. . దేశం కోసం ప్రాణాలర్పించిన ధైర్యవంతులకు నివాళులు అర్పించడం మన సామాజిక బాధ్యత అని అన్నారు.సిబిసి ఫీల్డ్ ఆఫీస్ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ కందాల శ్రీరామమూర్తి కందాళ మాట్లాడుతూ ఈ క్యాంపెయిన్‌లో మన అమరవీరుల స్మారకార్థం పంచాయతీ, గ్రామం నుంచి బ్లాక్, పట్టణ స్థానిక సంస్థలు, రాష్ట్ర, జాతీయ స్థాయిలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా అమృత్ కలాష్ యాత్ర కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రచారం 12 మార్చి 2021న ప్రారంభించబడిన ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ ముగింపు కార్యక్రమం 2023లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వర్షపు జల్లులు కురుస్తు న్నప్పటికీ, కలెక్టర్ ఈ వేడుకల్లో పాల్గొని సైనికులను సన్మానించారు.తొలుత జాతీయ జెండా ను ఆవిష్కరించి,
‘పంచ్ ప్రాణ్’ ప్రతిజ్ఞ,  అనంతరం ‘వీరోన్‌ కా వందన్‌’ కార్యక్రమాలు నిర్వహించి 13 మంది మాజీ సైనికులను సన్మానించి,, మొక్కలు నాటే కార్యక్రమంలో కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌ ఫీల్డ్‌ పబ్లిసిటీ ఆఫీసర్‌ వీరులను సన్మానించారు. పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వం, రంగోలి వంటి పలు పోటీలు నిర్వహించి నేడు విజేతలకు బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా సైనిక్ అధికారి, కెప్టెన్ సత్య ప్రసాద్, డి ఆర్ వో జి. నర్సింహులు, ప్రాజెక్ట్ డైరెక్టర్ (డ్వామా) పి. జగదాంబ, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *