Breaking News

వస్త్రాలత మెడికల్ క్యాంపు

-మెడికల్ క్యాంపు లో వైద్యం చేయించుకున్న వస్త్రాలత లో కార్మికులు ఎంప్లాయ్స్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు జన్మదిన సందర్భంగా స్వర హాస్పిటల్ వారి సౌజన్యంతో కాళేశ్వర రావు మార్కెట్ వద్ద గల వస్త్రలత ప్రాంగణంలో మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశారు.ఈ క్యాంపు కి మాజీ మంత్రి పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ క్యాంపును నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఎమ్మెల్సీ రుహుల్ల స్థానిక కార్పొరేటర్ మండేపూడి చటర్జీ ప్రారంభించారు.ఈ సందర్భంగా వెలంపల్లి మాట్లాడుతూ నా పుట్టినరోజు సందర్భంగా స్వర హాస్పిటల్ వారి సౌజన్యంతో వస్త్రాలత కమిటీ వారు మెడికల్ క్యాంపు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు.పేదల అందరికీ మంచి వైద్యం అందించేందుకు ప్రభుత్వం కూడా కృషి చేస్తుందన్నారు.ఈ రాష్ట్ర ప్రభుత్వం వైద్యానికి పెద్ద పీట వేస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కొనకళ్ళ విద్యాధరరావు, అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొండపల్లి బుజ్జి,వస్త్రాలత కమిటీ అధ్యక్షులు,కార్యదర్శి,కోశాధికారి మరియు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *