– కలెక్టర్, జాయింట్ కలెక్టర్ పర్యవేక్షణ లో చర్యలు
-డీఎస్ఓ విజయభాస్కర్.
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో వినియోగదారుల రక్షణ కొరకు పటిష్టమైన చర్యలు చేపడుతున్నట్లు జిల్లా పౌర సరఫరాల అధికారి పి.విజయ భాస్కర్ పేర్కొన్నారు.గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా వినియోగదారుల రక్షణ మండలి ద్వితీయ సమావేశం లో ముఖ్యఅతిథిగా డీఎస్ఓ పి.విజయ భాస్కర్ పాల్గొన్నారు. గత సమావేశం నకు సంబంధించి అంశాలు , చేపట్టిన చర్యల గురించి వివిధ శాఖల అధికారులు వివరణ ఇచ్చారు.ఈ సందర్భంగా డి ఎస్ వో పి. విజయ భాస్కర్ మాట్లాడుతూ, వినియోగదారుల హక్కులపై విద్యార్థి దశ నుంచే పిల్లల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. రెస్టారెంట్లు, రోడ్ సైడ్ ఆహార హోటల్స్ పై నిఘా పెంచి చర్యలు చేపట్టాలని సభ్యుల అభిప్రాయాలు మేరకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ప్రైవేట్ పాఠశాలల పై అనేక ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో తనిఖీలు చేయాలని , ట్యూషన్ ఫీజు నియంత్రణ కి చర్యలు చేపట్టాలని సభ్యుల అభిప్రాయాలను పరిగణనాలోకి తీసుకోవడం జరుగుతుందని అన్నారు.ఈ సందర్భంగా వినియోగదారుల సంఘం సభ్యులు గుర్తింపు కార్డులు ఇప్పించడానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సభ్యులు సూచనలు మేరకు కలెక్టర్, జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కారం దిశగా, వినియోగదారులకు మరింత మెరుగైన పౌర సేవలు అందించే సామర్థ్యం పెంచే దిశలో మరింత చురుగ్గా పనిచేయడం, ప్రజల్లో అవగాహన కల్పించడం జరుగుతుందని విజయ్ భాస్కర్ తెలిపారు.నగరంలో ఆర్టీసీ అధికారులు సిటీ బస్సులు నడిపే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. గ్రామాల్లో మంచినీటి సదుపాయం కల్పించి, నిర్దిష్టమైన సమయాల్లో త్రాగు నీటి సౌకర్యం అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. పబ్లిక్ కుళాయిలు ఏర్పాటు చేయాలని కోరారు. ప్రైవేట్ హాస్పిటల్స్ లో అధిక ఫీజు వసూలు మరియు పార్కింగ్ ప్లేస్ ఉండే విధంగా చూడాలని సభ్యులు కోరారు.ఈ కార్యక్రమంలో ఎస్ ఇ ఆర్ డబ్ల్యు ఎస్ శంకర్ రావు, ఏడి మార్కెటింగ్ శాఖ సునీల్ వినయ్, లీగల్ మెట్రాలజీ ఏసి శామ్యూల్ రాజు, డిసిపిసి సభ్యులు గొట్టిముక్కల అనంతరావు, సుంకర వీరశేఖర్, డీవీకే రమేష్, వై.కే. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News