Breaking News

ఓటర్ల జాబితా పరిశీలనలో రాజకీయ పార్టీలు భాగస్వాములు కావాలి .. జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో జరుగుతున్న ఇంటింటి ఓటర్ల జాబితా పరిశీలన ప్రక్రియలో అన్ని రాజకీయ పార్టీలు భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు రాజకీయ పార్టీ నాయకులను కోరారు.గురువారం ఆయన కలెక్టరేట్లోని తన చాంబర్లో జిల్లాలోని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై ఇంటింటి ఓటర్ల జాబితా పరిశీలన ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న 14,68,176 మంది ఓటర్లకు గాను 12,44,681 మంది ఓటర్లను ఇంటింటికి తిరిగి ఆన్లైన్ లో బిఎల్ఓ యాప్ ద్వారా వెరిఫై చేయటం జరిగిందన్నారు. ఏడు నియోజకవర్గాల్లో ఇప్పటికి ఇంటింటి ఓటర్ల జాబితా పరిశీలన 85 శాతం పూర్తయిందని, త్వరలో మిగిలిన వెరిఫికేషన్ పూర్తి చేస్తామని తెలిపారు.జిల్లాలో బూత్ స్థాయి అధికారులు (బిఎల్ఓ) నిర్వహిస్తున్న ఇంటింటి ఓటర్ల జాబితా పరిశీలనలో ఆయా నియోజకవర్గాల పరిధిలోని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు భాగస్వామ్యం అయ్యి, పక్కాగా జరుగుతున్నదీ లేనిదీ పరిశీలించాలన్నారు. కొత్త ఓటర్ల నమోదుకు ఫారం 6, తొలగింపునకు ఫారం 7, మార్పులు చేర్పుల కోసం ఫారం 8 ఇస్తూ ఈ వెరిఫికేషన్ ప్రక్రియ జరుగుతోందని, గుర్తించిన సమస్యలను జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకురావాల్సిందిగా కలెక్టర్ రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు.జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వర్లు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *