Breaking News

నిడదవోలు లో ఆగస్ట్ 22 న సిఎం పర్యటన

 

-సభా వేదిక , హెలిప్యాడ్, రూట్ మ్యాప్ పరిశీలన
-ముందస్తు ఏర్పాట్లు పై ఎమ్మెల్యే, అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలన

నిడదవోలు , నేటి పత్రిక ప్రజావార్త :
ఆగస్ట్ 22 న ముఖ్యమంత్రి పర్యటన నేపధ్యంలో ముందస్తు ఏర్పాట్లను పరిశీలించడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు.గురువారం మధ్యాహ్నం నిడదవోలు సెయింట్ అంబ్రోస్ స్కూల్ ఆవరణ, హెలి ప్యాడ్ గ్రౌండ్ , రూట్ మ్యాప్ ను స్థానిక ఎమ్మెల్యే జీ. శ్రీనివాస నాయుడు, జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్, అదనపు ఎస్పీ ఎం. రజనీ, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు.నిడదవోలు లో ఆగస్ట్ 22 న వైయస్ఆర్ కాపు నేస్తం కు సంబందించి రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొననున్న దృష్ట్యా ఏర్పాట్లను అత్యంత పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ మాధవీలత పేర్కొన్నారు.. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత సిఎం పర్యటన నిమిత్తం రూట్ మ్యాప్, హెలిప్యాడ్, సభా వేదిక సెయింట్ అంబ్రోస్ స్కూల్ ఆవరణలో చేపట్ట వలసి ఉన్న పనులకు చెంది క్షేత్ర స్థాయి లో సమీక్ష నిర్వహించారు. పోలీస్, రెవెన్యూ, మునిసిపల్ ఇతర శాఖల అధికారులకు చెయ్యవలసిన పనులు పై దిశా నిర్దేశనం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *