Breaking News

రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి లక్ష్యాలను పూర్తి చెయ్యాలి…

రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త :
పూర్తి చేసిన ప్రాధాన్యత భవనాలను ఆగస్ట్ చివరి నాటికి సంబంధిత శాఖలకు అందించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత తెలియ చేశారు. గురువారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయవాడ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో రెవెన్యూ , రీ సర్వే, భూసేకరణ, మిల్లెట్స్, వ్యవసాయం, హౌసింగ్, హౌస్ సైట్స్, పీ ఆర్ ప్రాధాన్యత భవనాలు, ఉపాధి హామీ , జగనన్న కు చెబుదాం, స్వమిత్వ లపై సమీక్ష నిర్వహించారు.స్థానిక కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత, జేసీ ఎన్. తేజ్ భరత్ ఇతర అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి కె యస్ జవహర్ రెడ్డి మాట్లాడుతూ, రీ సర్వే పనులు, భూసేకరణ వేగవంతం చేయాలని ఆదేశించారు. ఆగస్ట్ 30 న రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల హౌసింగ్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ప్రారంభించనున్న దృష్ట్యా రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి లక్ష్యాలను పూర్తి చెయ్యాలని అన్నారు. రైతులకు చెంది ఈకేవైసి పూర్తి చెయ్యాలని , సి సి ఆర్ సి కార్డుల పంపిణీ చెయ్యాలని ఆదేశించారు.ఈ సందర్భంగా కలెక్టర్ కె. మాధవీలత వివరాలు తెలియ చేస్తూ, జిల్లాలో 54 గ్రామాల్లో రీ సర్వే పనులు చేపట్టవలసి ఉండగా, 55 గ్రామాల్లో రీ సర్వే డ్రోన్ పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. జిల్లాలో కాపవరం లే అవుట్ జిల్లా స్థాయి హౌసింగ్ గృహ ప్రవేశ కార్యక్రమం నిర్వహించడం కోసం ఏర్పాట్లు చేస్తున్నామన్నారు . నూతనంగా జిల్లాకు చెందిన గతంలో ఇచ్చిన లక్ష్యం మేరకు 20,337 ఇళ్ళ నిర్మాణ లక్ష్యం 100 శాతం ఇళ్ళ నిర్మాణం పూర్తి చేసినట్లు , కొత్తగా మరో 300 లక్ష్యం ఇచ్చారని, వాటిని పూర్తి చెయ్యడం తో పాటు విద్యుత్, త్రాగునీరు, సోప్ పిట్స్ సమాంతరంగా చేపట్టడం జరుగుతున్నట్లు తెలిపారు. టెక్నికల్ శాంక్షన్ , పరిపాలన శాంక్షన్ అనుగుణంగా ఉండేలా చూడడం జరుగుతుందని అన్నారు.ప్రాధాన్యత భవనాలు కింద 373 సచివాలయ భవనాలకు 323 పూర్తి చేసి, 228 అందచెయ్యడం జరిగిందన్నారు. అర్భికే లలో 347 లో 266 పూర్తి చేశామని, 168 అందచెయ్యగా, హెల్త్ క్లినిక్స్ లో 258 కి 118 పూర్తి చేసి 91 అప్పగించడం జరిగిందన్నారు. పూర్తి చేసిన భవనాలు ఆగస్ట్ చివరికి అందజేసేందుకు క్షేత్ర స్థాయి అధికారులు, కాంట్రాక్టర్ల కు నియోజక వర్గ సమీక్ష లో స్పష్టం చేసిన్నట్లు కలెక్టర్ వెల్లడించారు.జిల్లాలో ఈ క్రాప్ కు చెంది 88,075 లక్ష్యాలకు గానూ 93,367 (106 శాతం) సాధించినట్లు తెలిపారు. పిఎం కిసాన్ యోజన కింద 101104 రైతులు కు గాను 82,767 మంది నమోదు చేసినట్లు మిగిలిన వారి వివరాలు కూడా పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.ఉపాధి హామీ పథకం కింద ఆగస్ట్ నాటికి 36.07 లక్షల పని దినాలకు 36.50 (101 శాతం) పనిదినాలను కల్పించామన్నారు. స్వమిత్వా కింద జిల్లాలో 300 గ్రామ పంచాయతీలలో గ్రౌండ్ ట్రూధింగ్ పనులను చేపట్టినట్లు తెలిపారు. జగనన్న కు చెబుదాం కింద 6299 అర్జీలు రాగా 4,892 పరిష్కారం చేశామని, 406 అర్జీలు తిరిగి రాగా వాటిని వ్యక్తిగతం గా పరిగణన లోకి తీసుకుని అర్హత మేరకు పరిష్కారం చేస్తున్నట్లు తెలిపారు. 1001 అర్జీలు పరిశీలన లో ఉన్నట్లు తెలిపారు.ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, డి ఆర్వో జీ. నరసింహులు, జిల్లా అధికారులు పశు సంవర్ధక అధికారి ఎస్ జి టి సత్య గోవింద్, వ్యవసాయ అధికారి ఎస్. మాధవ రావు, మార్కెటింగ్ అధికారి ఎమ్. సునీల్ వినయ్, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారి. ఏబివి రెడ్డి, గ్రామీణ నీటి సరఫరా అధికారి డి. బాల శంకర రావు, డ్వామా పిడి పి. జగదాంబ, డిపివో జే ఎస్ సత్యనారాయణ, ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *