విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి గురువారం అధికారులతో కలసి నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయ ఆవరణలో నిర్మాణలో ఉన్న నూతన భవనమును పరిశీలించారు. ఈ సందర్భంలో భవన నిర్మాణము యొక్క స్థితిగతులను మరియు అక్కడ అందుబాటులో గల మౌలిక సదుపాయాలు మొదలగు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా మూడో ఫ్లోర్ లో జరుగుతున్న మార్బుల్, సీలింగ్, కరెంట్, ప్లాస్టింగ్ పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. అదేవిధంగా పనులను వేగవంతముగా చేసి త్వరితగతిన పూర్తి చేయవలసినదిగా ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశించడమైనది.ఈ పర్యటనలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకటేశ్వర రెడ్డి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News