Breaking News

మధురా నగర్ ఆర్.యు.బి నిర్మాణ పనులను పరిశీలన…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్‌, గురువారం నాడు మధురా నగర్ ఆర్.యు.బి నిర్మాణ పనులను పరిశీలనా మరియు బి.ర్.టి.సి రోడ్డు, బందర్ రోడ్డు నందు పారిశుద్ధ్య పనులను పరిశీలించారుసెంట్రల్ నియోజకవర్గ 29వ డివిజన్ లోని సాయిబాబా కాలనీలో నగరపాలక సంస్థ అద్వర్యంలో జరుగుతున్న మధురా నగర్ ఆర్ యు బి నిర్మాణ పనులను విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ ఫండ్కర్ IAS ఈరోజు సమగ్రంగా పరిశీలించారు.నిర్మాణ పనుల పురోగతిపై వివరాలను సంబంధిత అధికారులను అడిగితెలుసుకుని ప్రజల రాకపోకలకు ట్రాఫిక్ సమస్యలను అరికట్టెందుకు నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ నిర్మాణ పనులను వేగవంతము చేసి ప్రజలకు త్వరితగతిన అందుబాటులోనికి తీసుకునిరావాలని సంబందిత అధికారులను ఆదేశించారు.విజయవాడ నగరపాలక సంస్థ పట్టణ అభివృద్ధి మరియు మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి కొనసాగుతున్న ప్రయత్నాలలో భాగంగా మధురా నగర్ ఆర్ యు బి నిర్మాణ ప్రాజెక్ట్ చేపట్టడం జరిగిందని, నగరాభివృద్ధికై చేపట్టవలసిన చర్యలు చేపట్టడం జరిగినదని,ప్రాజెక్ట్‌లను పూర్తి చేయడానికి నగరపాలక సంస్థ అంకిత భావముతో కృషిచేస్తుందని అన్నారు.అనంతరం కమిషనర్ బందర్ రోడ్డు మరియు బి.ర్.టి.సి రోడ్డు రోడ్డు లో శానిటేషన్ పనులను క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించి. మౌలిక సదుపాయాలు మరియు శానిటేషన్ కార్యక్రమాల పురోగతి మరియు నాణ్యతను మెరుగుపరచాలని సూచించారు.నగరంలోని ప్రతి ఒక్కరికీ ఆరోగ్యకరమైన మరియు పరిశుభ్రమైన వాతావరణాన్ని పెంపొందించలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్  స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్‌  కోరారు.పర్యటనలో చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.పి.రత్నావళి, మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *