Breaking News

ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి

ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి
-క్షేత్ర స్థాయిలో అధికారుల పనితీరు అభివృద్ధికి నిదర్శనం
-ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలు నిర్మాణ అంచనా వ్యయం పెంపు
-అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ పథకాల ప్రయోజనం చేకూరాలి
-నిడదవోలు సంక్షేమ సమీక్షలో పాల్గొన్న జిల్లా ఇంఛార్జి మంత్రి వేణుగోపాల కృష్ణ

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలకు పరిపాలన సౌలభ్యం కలుగ చేసే విధానం అమల్లో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సరళీకృత వ్యవస్థ తీసుకుని రావడం ఆ ఫలాలు అందరికీ చేరేలా చర్యలు తీసుకోవడం జరుగుతోందని జిల్లా ఇంఛార్జి మంత్రి, రాష్ట్ర బిసి సంక్షేమ, సమాచార పౌర సంబంధాల, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ పేర్కొన్నారు.మంగళవారం స్థానిక కలెక్టరేట్ స్పందన సమావేశ మందిరంలో నిడదవోలు నియోజక వర్గ మండలం స్థాయి జిల్లా, నియోజక వర్గ, మండల స్థాయి అధికారులతో సంక్షేమ సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎమ్మెల్యే జీ. శ్రీనివాస నాయుడు, ఎంపి మార్గాని భరత్ రామ్,  జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, నిడదవోలు మునిసిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, ఇతర అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఇంఛార్జి మంత్రి సిహెచ్. వేణుగోపాల కృష్ణ మాట్లాడుతూ, నియోజక వర్గ పరిధిలో పలు రకాల అంశాలు సమావేశం దృష్టికి తీసుకుని రావడం జరిగిందని అన్నారు.  రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచన కు అనుగుణంగా ప్రాధాన్యత కార్యక్రమాల అమలు తీరు పై సమీక్ష కు ఇది చక్కటి పరిష్కారం అన్నారు. పరిపాలన సంస్కరణల అమలు లో రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యం లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకుని రావడం జరిగిందన్నారు. పరిపాలన సంస్కరణ లో భాగంగా ప్రజలకు సత్వర సేవలు అందించడం కోసం సచివాలయ , వాలంటీర్ వ్యవస్థ, రైతులకు మేలు చేకూరేలా అర్భికే వ్యవస్థ తీసుకుని వచ్చామన్నారు. క్షేత్ర స్థాయి లో చేపడుతున్న అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చెయ్యడం ద్వారా అధికారులు తమ బాధ్యత నిర్వహించడం కోసం ఈ సమావేశం చక్కటి వేదిక గా మంత్రి పేర్కొన్నారు. తద్వారా ఆపనులు మరింత త్వరిత గతిన పూర్తి చెయ్యడం సాధ్యం చెయ్యగలుగుతా మన్నారు. ఆ మేరకు కార్యాచరణ నిర్దేశించుకుని పనులు పూర్తి చేసి ప్రజలకు ఆయా సేవలు అందించాలని పేర్కొన్నారు. నిత్యకృత్యం గా చేపట్టే విధులతో పాటుగా ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి ఆమేరకు ప్రభుత్వ లక్ష్యాలను ప్రజలకు సాధ్యమైనంత తొందరలో అందజేసేందుకు కలిసి అడుగులు వేయడం ముఖ్యం అని పేర్కొన్నారు.నియోజక వర్గ సంక్షేమ సమీక్షా సమావేశం ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు, మండల పరిధిలోని అధికారుల మధ్య సమన్వయ సాధించడానికి చక్కటి వేదికగా జిల్లా కలెక్టర్ కె. మాధవీలత పేర్కొన్నారు. నియోజక వర్గంలో సమస్యల పరిష్కారం కోసం ఈ వేదిక సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కాంట్రాక్టర్లు, ఏజెన్సీ ల నుంచి ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కారం చేస్తామని అన్నారు. అర్భికే, సచివాలయ, వైయస్ఆర్ హెల్త్ క్లినిక్ భవనాలకు చెంది అంచనాలు పెంచడం జరిగిందన్నారు. పనులు పూర్తి చేసిన వాటికి అనుగుణంగా చెల్లింపులు జరుగుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. సచివాలయ భవన నిర్మాణ అంచనా రూ.40 లక్షల నుంచి రూ.43.60 లక్షలు, అర్భికే రూ.21.8 లక్షలు నుంచి రూ.23.94 లక్షలు, హెల్త్ క్లినిక్స్ రూ.17.5 లక్షల నుంచి రూ 20.80 లక్షలకు పెరిగిందన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పథకాలు సంతృప్తి స్థాయి లో అందచేసే లక్ష్యం దిశగా బాధ్యతలను నిర్వర్తించడం జరగాలన్నారు.ఎంపి మార్గాని భరత్ రామ్ మాట్లాడుతూ, నియోజక వర్గ స్థాయి సమావేశం లో చర్చించిన అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి ఆయా పనులు పూర్తి చేయాలన్నారు. జిల్లా కలెక్టర్ జిల్లా స్థాయి లో పూర్తి చేసే వాటికి అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.శాసన సభ్యులు జి. శ్రీనివాస నాయుడు మాట్లాడుతూ, నియోజక వర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, అధికారుల సహాయ సహకారాలు సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రాధాన్యత భవనాలు నిర్మాణం, పెండింగు పనులు త్వరితగతిన పూర్తి చేసే క్రమంలో వైయస్ఆర్ హెల్త్ క్లినిక్స్ నిర్మాణాలు పై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. ఆమేరకు ఏమైనా క్షేత్ర స్థాయి లో ఇబ్బందులు ఎదురైతే తన దృష్టికి తీసుకుని రావాలని కోరారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అర్హులకు అందచెయ్యడం తో పాటు నియోజక వర్గ అభివృద్ధి పనులు చెయ్యడం కోసం మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కలెక్టర్ చొరవ తీసుకోవాలని పేర్కొన్నారు. జగనన్న హౌసింగ్ కాలనీలకు చెంది అనుసంధన రహదారి పనుల కోసం భూసేకరణ చేసే క్రమంలో స్థానికుల నుంచి సహకారం అందించడానికి చొరవ తీసుకుంటానని చెప్పారు.తొలుత సమావేశంలో ప్రాధాన్యత భవనాలపై సమీక్ష చేస్తూ నియోజక వర్గంలో 149 ప్రాధాన్యత భవనాల్లో 105 పూర్తి చెయ్యగా ఇప్పటికే 50 భవనాలు అప్పగించడం జరిగిందని, మిగిలిన 55 ఆగస్ట్ చివరి నాటికి అప్పగిస్తామని అన్నారు. పెండింగ్ 44 భవనాలు పురుగతిలో ఉన్నాయని, వాటిని సెప్టెంబర్ 15 నాటికి పూర్తి చేసెందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు.విద్య శాఖ పై సమీక్ష చేస్తూ నాడు నేడు పనులు సంబంధించి త్వరిత గతిన పూర్తి చెయ్యాలని శాసన కోరారు.  91 స్కూల్స్ పరిధిలో 73 అదనపు తరగతి గదులు, 36 నాడు నేడు పనులు, 146 కాపౌండ్ వాల్ పనులు చేపట్టినట్లు తెలిపారు. సెప్టెంబర్ చివరి నాటికి దాదాపు అన్ని పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకుని వస్తామని కలెక్టర్ పేర్కొన్నారు.హౌసింగ్ కి చెంది నియోజక వర్గంలో 145 లే అవుట్ లలో 12,462 ఇళ్లు మంజూరు చేసినట్లు తెలిపారు. నియోజక వర్గంలో 5,664 ఇళ్లను పూర్తి చేశామన్నారు. ఇప్పటి వరకు 114 కోట్ల ను ఖర్చు చేసినట్లు తెలిపారు. మోర్త, విజ్జేశ్వరం , నిడదవోలు పరిధిలో మూడు లే అవుట్ లలో అనుసంధాన రహదారి సమస్య పై చర్యలు తీసుకుంటామని తెలిపారు.వ్యవసాయ అనుబంధ కార్యక్రమాలపై సమీక్ష చేస్తూ, సి సి ఆర్ సి కార్డులు 20 వేల లక్ష్యం కు గానూ 16,511 మందికి జారీ చేశామన్నారు. క్రాప్ ఇన్సూరెన్స్ కింద 5555 మంది రైతులకు చెందిన 7210.5 ఎకరాల్లో రూ.2.57 కోట్ల క్లైయిమ్ పరిష్కారం చేశామన్నారు.అనంతరం ఇరిగేషన్, హెల్త్, పౌర సరఫరాలు, విద్యుత్ శాఖ లపై  సమీక్ష నిర్వహించారు.ఈ సమావేశంలో నిడదవోలు పురపాలక సంఘం చైర్మన్ భూపతి ఆదినారాయణ, జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, సిపివో ఏ. ముఖ లింగం, ఇతర సమన్వయ శాఖల అధికారులు, నిడదవోలు, పెరవలి, ఉండ్రాజవరం మండల అధికారులు, ప్రత్యేక అధికారులు, స్థానిక నియోజక వర్గ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *