-కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్.
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అభివృద్ధి చెందుతున్న సింగ్ నగర్ ఎక్సెల్ ప్లాంట్ ను మంగళవారం ఉదయం నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్ క్షేత్ర స్థాయిలో పరిశీలించి ప్లాంట్లు నందు జరుగుతున్న పనుల యొక్క వివరాలు అడిగితెలుసుకొని అధికారులకు పలు సూచనలు చేసారు.ముందుగా ఎక్సెల్ ప్లాంట్ నందు నూతనంగా ఏర్పాటు చేస్తున్న ఇన్ఫర్మేషన్ పార్కు పనులను పరిశీలించి పార్కులో జరుగుతున్న పనులను త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులకు పలు ఆదేశాలు చేసారు. 2-అక్టోబర్-2023 వరకు పనులు పూర్తి చేసి పార్కును ప్రారంభోత్సవం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. తదుపరి ఎంట్రేన్స్ గేటు దగ్గర ఏర్పాటు చేసిన కర్బ్ వాల్ ను పరిశీలించి ఎక్కువగా ఉన్న రాళ్ళను అక్కడి నుంచి తొలగించి ఆ ప్రదేశంలో మొక్కలను నాటాలని ఉద్యానవన అధికారులకు సూచించారు. అదేవిధంగా ఎక్సెల్ ప్లాంట్ కు రోజుకు ఎంత చెత్త వస్తుంది అని కంప్యూటర్ రూమ్ నందు సిస్టమ్ లో తనిఖీ చేసి మరియు చెత్త వేయింగ్ (వే బ్రిడ్జి) పని తీరును పర్యవేక్షించి పలు సూచనలు చేసారు. అదేవిధంగా నూతనంగా వేసిన రోడ్డును పరిశీలించి పలు సూచనలు చేసారు.ప్లాంట్ ఆవరణలో ఉన్న ట్రీ వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్, టౌన్ ప్లానింగ్ సెక్షన్ స్క్రాప్, స్క్రాప్ ప్లేసింగ్ యూనిట్, ఆఫీసు బిల్డింగ్, మాట్రేస్స్ వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్, సి&డి వేస్ట్ రీసైక్లింగ్ యూనిట్, వెహికల్ పార్కింగ్ వంటి ప్రదేశాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేసారు.ప్లాంట్ ఆవరణలో జరుగుతున్న పనులను త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులకు పలు ఆదేశాలు చేసారు. ఈ సందర్భంలో ప్లాంట్ ఆవరణలో ఆహ్లాదకరంగా ఇండస్ట్రియల్ వాతావరణ కలిగి ఉండే విధంగా పూర్తి స్థాయిలో పచ్చదనం పెంపొందించే విధంగా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఉద్యానవన అధికారులకు సూచించారు.ఈ పర్యటనలో అదనపు కమీషనర్ (ప్రాజెక్ట్స్) కె.వి సత్యవతి, డిప్యూటీ సిటి ప్లానర్ (ప్లానింగ్ ) జుబిన్ శిరన్ రాయ్, ఎగ్గిక్యుటివ్ ఇంజనీర్లు ఏ.ఎస్.ఎన్ ప్రసాద్, సత్యనారాయణ, ఏ.డి.హెచ్ శ్రీనివాసు, శానిటరీ ఇన్స్ పెక్టర్లు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News