Breaking News

ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా విగ్రహం స్మృతివనం నిర్మాణాలు.

-అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులు పరిశీలన
-నగరపాలక సంస్థ కమిషనర్  స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్‌.

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  ఆదేశాలతో స్పెషల్ సీ.ఎస్..వై శ్రీలక్ష్మి ఐఏఎస్ గారి పర్యవేక్షణలో విజయవాడ మున్సిపల్ కమిషనర్  స్వపనిల్ దినకర్ పుండ్కర్ ఐఏఎస్  ఆధ్వర్యంలో అంబెడ్కర్ స్మృతి వనము పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయి అని పేర్కొన్నారు.విజయవాడ స్వరాజ్ మైదానంలో నిర్మాణంలో ఉన్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహ స్మృతి వనం నిర్మాణ పనులను మంగళవారం కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్‌ అధికారులతో కలిసి పరిశీలించారు.కమిషనర్ మాట్లాడుతూ ప్రపంచ సందర్శకులకు సైతం వేదిక డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం స్మృతి వనం పనులను రాష్ట్ర ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు నీళితంగా పరిశీలిస్తూ పలు సూచనలు చేస్తున్నారన్నారు. డిజిటల్ మ్యూజియం, మినీ థియేటర్ నిర్మాణపు పనులు పూర్తిగావచ్చాయని లైటింగ్, గ్రానైట్, పాత్ వే, వాటర్ ఫౌంటైన్, వెహికల్ పార్కింగ్, ఎలక్ట్రిసిటీ పనులు ల్యాండ్ స్కేపింగ్, గ్రీనరీ సుందరీకరణ తదితర పనులను మరింత వేగవంతం చేసి పూర్తిచేయాలని అధికారులను ఆదేశించామన్నారు. నిర్మాణ పనులను రానున్న రెండు నెలల్లో పూర్తిచేసి ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ తెలిపారు.అంబేద్కర్ విగ్రహా నిర్మాణ పనులు పరిశీలనలో మంత్రి వెంట మున్సిపల్ కమీషనర్ స్వప్నిల్ దినకర్ ఫుడ్కర్, ఏపీ ఐఐసీ చీ ఇంజనీర్ నరసింహారావు జోనల్ మేనేజర్ సీతారాం, డిప్యూటీ జోనల్-మేనేజర్ రహీమ్, కపిసి ప్రాజెక్టు డైరెక్టర్ పి. వాసుదేవరావు. ప్రాజెక్ట్ మేనేజర్లు కె. కృష్ణమోహన్, జావీద్ తదితరులు పాల్గొన్నారు..

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *