-బాలికల హాస్టల్ మరియు బాలుర హాస్టల్‌లు సిద్ధం
– తొలి బ్యాచ్ వైద్య విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కలుగ చేస్తున్నాం
-సెప్టెంబరు 1 నుండి 150 మంది మెడికో లకు తరగతులు ప్రారంభం
-ప్రభుత్వ వైద్య కళాశాల వసతి గృహాలను, తరగతి గదులు పరిశీలించిన ఎంపీ, కలెక్టర్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రానున్న రోజుల్లో ఎడ్యుకేషనల్ హబ్ గా రాజమహేంద్రవరం ప్రత్యేకత సాధించడంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ కీలకం కానున్నదని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత, ఎంపి మార్గాని భరత్ రామ్ లు పేర్కొన్నారు.మంగళవారం ఉదయం స్థానిక ప్రభుత్వ మెడికల్ కళాశాల భోధనాసుత్రిని ఎంపి మార్గాని భరత్ రామ్ తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ, సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి మెడికల్ కాలేజీలో మొదటి ఏడాది మెడికల్ విద్యార్థులకు బోధనా తరగతులు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే ఇప్పటికే మెడి కో ల కోసం బాలికలకు, బాలురకు తాత్కాలికంగా వసతి గృహాలను ఏర్పాటు చెయ్యడం జరిగిందన్నారు. మెడికో లకి చెందిన బోధనా తరగతులను సిద్దం చేసి, అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతోందని మాధవీలత పేర్కొన్నారు. కొత్తగా ఏర్పాటైన తూర్పు గోదావరి జిల్లా కి మెడికల్ కళాశాల ఏర్పాటు ఒక మంచి పరిణామం అన్నారు. రానున్న రోజుల్లో ఎడ్యుకేషనల్ హబ్ గా తీర్చిదిద్దే ప్రయత్నం లో మెడికల్ కాలేజీ ఎంతో దోహదం చేస్తుందని మాధవీలత తెలిపారు. ఈ ఏడాది తొలి బ్యాచ్ లో చేరే విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా తగిన అన్ని చర్యలను తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. డైనింగ్ హాల్, బట్టలు ఉతికే ప్రాంతం విడదీస్తూ మధ్యలో గోడ కడితే బాగుంటుం దన్నారు. వారంలో విద్యార్థులు రానున్న దృష్ట్యా త్వరితగతిన పనులు పూర్తి కావాలని కాంట్రాక్టర్ కు కలెక్టర్ ఆదేశించారు.ఈ సందర్భంగా రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్ రామ్ మాట్లాడుతూ, రాజమండ్రి నగర స్థాయిని మరింత పెంచే విధంగా మన జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు శుభ పరిణామని పేర్కొన్నారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో హాస్టల్ నిర్మాణంలో కొన్ని మార్పులను సూచించా మన్నారు. డైనింగ్ హాల్, విద్యార్థులు బట్టలు ఉతుక్కునే ప్రాంతం ఒకే కారిడార్ ఉండటం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశామని , మార్పులు చేయాలని సూచించామన్నారు. వర్షం వస్తే విద్యార్థులు ఇబ్బందులు పడేలా కాకుండా సీలింగ్ పూర్తిగా మూసివేయమని ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ప్రస్తుతం మొదటి ఒక సంవత్సరానికైనా తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్నా .వాటి వల్ల విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు పటిష్టంగా ఉండాలని కాంట్రాక్టర్ కు సూచించారు.సెప్టెంబరు ఒకటవ తారీఖు నుంచే ప్రభుత్వ వైద్య కళాశాల మొదటి సంవత్సరం విద్యార్థినీ విద్యార్థు లకు తరగతులు ప్రారంభం కానున్నట్టు ఎంపీ భరత్ తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 16 ప్రభుత్వ వైద్య కళాశాలలు శాంక్షన్ చేయగా, వాటిలో 5 కళాశాలలు ఈ సంవత్సరం నుంచి ప్రారంభం అవుతున్నాయని , వాటిలో రాజమండ్రి ప్రభుత్వ మెడికల్ కళాశాల ఒకటన్నారు . ఇందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న సీఎం జిల్లా ప్రజల తరపున సిఎం కి కృతజ్ఞతలు తెలిపారు. తొలి ఏడాది బోధన తరగతులు నర్సింగ్ కళాశాలలో నిర్వహిస్తు న్నట్లు చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ వైద్య కళాశాల సొంత భవనంలో పూర్తి స్థాయిలో బోధన తరగతులు ప్రారంభం అవుతాయని పేర్కొన్నారు.మెడికల్ కాలేజీ అధికారులు వివరాలు తెలియ చేస్తూ, డిసెంబర్ నాటికి జాతీయ వైద్య మండలి ప్రతినిధుల సందర్శన ఉంటుందని తెలిపారు. వచ్చే ఏడాది నాటికి 450 పడకలతో హాస్పిటల్ లో వైద్య సేవలు అందుబాటులోకి తీసుకుని రావడం జరుగు తుందన్నారు. అదనంగా రెండు అంతస్తుల పని పూర్తి చేస్తున్నా మన్నారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి మరో క్రిటికల్ కేర్ బ్లాక్ వర్క్ ప్రారంభిస్తామని పేర్కొన్నారు. త్వరలో మరో 100 పడకలు పెరిగి పూర్తి స్థాయి హాస్టళ్లు అందుబాటులోకి రానున్నాయి. రెండో ఏడాది అడ్మిషన్స్ నాటికి పూర్తి స్థాయిలో అభివృధ్ధి పనులు పూర్తి చేస్తామన్నారు.నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాల, విద్యార్థులు హాస్టల్స్ ను ఎంపీ భరత్, జిల్లా కలెక్టర్ డాక్టర్ కే మాధవీలత, కమిషనర్ కే దినేష్ కుమార్, రాజమండ్రి అర్బన్ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ పరిశీలించారు.తనిఖీ కార్యక్రమంలో కమిషనర్ కే దినేష్ కుమార్, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి .సౌభాగ్యలక్ష్మి, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఆర్ రమేష్, ఏపీఎంఎస్ఐడీసీ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎస్. సుబ్రహ్మణ్యం, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కే. చంద్ర మౌళి, స్థానిక నాయకులు గూడూరి శ్రీనివాస్, వైద్యులు, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News