రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ ఖరీఫ్ సీజన్లో జిల్లా పరిధిలో పండించే ధాన్యం పూర్తి స్థాయి లో సేకరణ లక్ష్యంగా పెట్టుకుని చర్యలు తీసుకుంటామని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి సేకరణ కమిటీ సమావేశంనకు జిల్లా జాయింట్ కలెక్టర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జేసీ తేజ్ భరత్ మాట్లాడుతూ, గత మూడు ఖరీఫ్ లో దిగుబడి ఆధారంగా చేసుకుని ఈ సీజన్ లో అవసరమైన గన్ని బ్యాగులకు చెందిన ఇండెంట్ పౌర సరఫరాలు, డి ఎం పౌర సరఫరాలు, వ్యవసాయ అధికారులు బుధవారం సాయంత్రం కు అందచెయ్య లన్నారు. ఆ నివేదిక మేరకు ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు. జిల్లాలో ఈ ఖరీఫ్ లో 4,76,502 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనాకు రావడం జరిగిందన్నారు. ఆమేరకు స్థానిక అవసరాలకు 23,825 మెట్రిక్ టన్నుల వినియోగం అవుతుందని అన్నారు. నేరుగా మిల్లర్లు కొనుగోలు చేసేవి 11982 మెట్రిక్ టన్నుల ఉంటుందని, పౌర సరఫరాల సంస్థ ద్వారా 4,40,695 మెట్రిక్ టన్నుల కొనుగోలు కు అవకాశం ఉందన్నారు. గత మూడు సీజన్లలో గరిష్టంగా 2.84 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చెయ్యడం జరిగిందన్నారు. కస్టమైజ్డ్ మిల్లర్లు సరఫరా చేసే గన్ని బ్యాగులకు అనుగుణంగా లక్ష్యాలను ఇవ్వడం జరుగుతుందని అన్నారు. జిల్లాలో ప్రధానంగా నాలుగైదు రకాలు దిగుబడి వస్తుందని వాటిలో ఎంటియూ 1064 ఇంద్రా రకం 80,367 ఏమ్.టి., ఏం టి యూ 7029 (స్వర్ణ) రకం 1,73,061 ఎమ్.టి. , పి ఎల్ ఏ 1100 రకం 1,06,128 ఏం టి., సంపద స్వర్ణ 44,382 ఎమ్ టి., ఉన్నాయన్నారు. ఖరీఫ్ సీజన్లో కొనుగోలుకుఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల మేనేజర్ ఏ. కుమార్, జిల్లా పౌర సరఫరాల అధికారి బి. విజయ భాస్కర్, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్. మాధవరావు, డిసి ఎం ఎస్ మేనేజర్ వి ఎస్ కే మోహన్, మార్కెటింగ్ అధికారి ఏం. సునీల్ వినయ్, జిల్లా సహకార అధికారి వై. ఉమా మహేశ్వర రావు, వేర్ హౌస్ మేనేజర్ ఏం వి కుమార్, రీజనల్ మేనేజర్ ఎస్. సురేష్, ఎఫ్ సి ఐ డివిజన్ మేనేజర్ కే ఎస్ ఎన్ మూర్తి, రాజమండ్రి డివిజన్ మిల్లర్ అధ్యక్షులు ఎన్. బుల్లి మోహన్ రెడ్డి, రాజమహేంద్రవరం ఏరియా మిల్లర్స్ అధ్యక్షులు జే. శ్రీధర్, కొవ్వూరు తాలూకా మిల్లర్ అసోసియేషన్ అధ్యక్షులు ఏ. దొరయ్య, పలువురు మిల్లర్లు హాజరయ్యారు.
Prajavartha Online Telugu News