విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించి ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా వైద్యాధికారులు పని చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అన్నారు.
స్థానిక కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో మంగళవారం జిల్లాలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, డా. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, మదర్ అండ్ చైల్డ్ హెల్త్ సేవల పనితీరుపై సంబంధిత వైద్యాధికారులతో జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు సమీక్షించారు.ఈసందర్భంగా కలెక్టర్ డిల్లీరావు మాట్డాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి వైద్య రంగం పట్ల ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారని దీనిలో భాగంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజల ఆరోగ్య పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. నాడు `నేడు కార్యక్రమం ద్వారా కోట్లాధి రూపాయల నిధులతో ప్రభుత్వ ఆసుపత్రులలో కార్పొరేట్ స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తుందన్నారు. వైద్యధికారులు, పారామెడికల్ సిబ్బందిని పెద్ద ఎత్తున నియామకాలతో పాటు డయాగ్నస్టిక్ సెంటర్లు వంటి వాటిని ఏర్పాటు చేసి గ్రామ స్థాయి నుండే వైద్య సేవలందించే ఫ్యామిలీ ఫిజిషయన్ విధానాన్ని అమలు చేస్తున్నారన్నారు. జిల్లాలో 27 ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, 6 సామాజిక ఆరోగ్య కేంద్రాల ద్వారా వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా వైద్యాధికారులు పని చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సామాజిక ఆరోగ్య కేంద్రాలు ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్యులు సిబ్బంది పనితీరును మెరుగుపరచుకోవాలన్నారు. మాతా శిశు మరణాల నివారణలో భాగంగా ప్రసవాలన్ని ప్రభుత్వ ఆసుపత్రిలోనే జరగాలన్నారు. ఆరోగ్య కేంద్రాలలో ఓపి సేవలు పెరగాలన్నారు. గతంలో ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో సరైన మెడికల్ టీమ్ ఉండేది కాదని నేడు అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉంటున్నప్పటికి ఆశించిన స్థాయిలో వైద్య సేవలు అందించకపోవడం బాధకరమన్నారు.ఇప్పటికైనా వైద్యాధికారులు పనితీరును మెరుగుపరచుకోవాలన్నారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, ఆశ కార్యకర్తలు, ఎఎన్‌యంలు వారి పరిధిలోని గర్భిణీ స్త్రీల వైద్య అవసరాలకు సంబంధించి సిహెచ్‌సిలో ఉచితంగా అందించే స్కానింగ్, గైనికాలజిస్ట్ వైద్య సేవలను అందించాలన్నారు. డా. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా అందించే వైద్య సదుపాలయాలను ప్రతి ఒక్కరికి అందించి నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలను కల్పించి మరింత మంది సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. వైద్య సేవలు అందించడం ద్వారా ప్రజలలో మంచి డాక్టర్‌గా పేరు తెచ్చుకోవాలని కలెక్టర్ డిల్లీరావు వైద్యాధికారులకు సూచించారు.సమావేశంలో డియంఅండ్ హెచ్‌వో డా. యం సుహాసిని, డిసిహెచ్‌ఎస్ డా. స్వప్న, డిప్యూటి డియంహెచ్‌వో డా.ఇందుమతి, సామాజిక ఆరోగ్య కేంద్ర వైద్యధికారులు, సిబ్బంది ఉన్నారు.
Prajavartha Online Telugu News