-ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య చికిత్స అందిస్తున్నాం
-ప్రజల్లో నమ్మకం కలిగేలా మన పనితీరు ఉండాలి
– సహాయ కలెక్టర్ యశ్వంత్ కుమార్
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మానవ వనరుల అభివృద్ధి, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని సహాయ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.గురువారం కొవ్వూరులో ప్రవేటు సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్య సేవలు అందించే సామర్థ్యం పై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా సహాయ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ పరంగా అందిస్తున్న సేవలపై ప్రజల్లో నమ్మకం పెంచే బాధ్యత వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిపై ఉందని స్పష్టం చేశారు. ఎం ఎం ఆర్, ఐ ఎం ఆర్ మరణాలు సంభవించకుండా చూసే బాధ్యత క్షేత్ర స్థాయి సిబ్బందిపై ఉందన్నారు. క్రమం తప్పకుండా ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు గర్భిణీ ల, బాలింతల ఇళ్లను సందర్శించి వారి ఆరోగ్య పరిస్తితి పై వాకబు చేసి, అందుకు అనుగుణంగా వైద్య సేవలు అందించాలని పేర్కొన్నారు. అప్పుడు మీపై నమ్మకం పెరగడమే కాకుండా మాతృ, చిన్నారుల మరణాలు సంభవించకుండా నియంత్రణ సాధ్యం అవుతుందన్నారు. మాతృ మరణాలు తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను జారీ చేయడం జరిగిందన్నారు. వాటిని క్షేత్ర స్థాయిలో అమలు చేసే బాధ్యత క్షేత్ర స్థాయి అధికారులు, సిబ్బంది ముఖ్యంగా వైద్య అనుబంధ శాఖలపై ఉందని పేర్కొన్నారు. ఏ ఒక్క తల్లి గర్భం దాల్చడం వలన మరణించ కూడదు అనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా కొన్ని మార్గదర్శకాలను జారీ చేసిందని పేర్కొన్నారు. వివిధ దశల్లో చికిత్స అందించడం, వైద్య సేవలు అందించే సామర్థ్యం పెంచుకోవాలని పేర్కొన్నారు. ఈ ప్రక్రియ లో భాగంగా వైద్య సేవలు అందించే క్రమంలో రవాణా కోసం తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ ను ఖచ్చితంగా వినియోగించాలని ఆదేశించడం జరిగిందని పేర్కొన్నారు. గర్భిణీ లకి ముందస్తు డెలివరీ తేదీ కి నిర్ధారణ చెయ్యడం జరుగుతుందని, ఆమేరకు వారి ఆరోగ్య స్థితి ని తెలుసుకుని ఆమేరకు వైద్య సేవలు అందించవలసి ఉంటుందని అన్నారు. రక్తహీనత ఉన్న గర్భిణీ స్త్రీలను రక్తమార్పిడి కొరకు ఇంటి నుండి ఆసుపత్రికి తిరిగి ఇంటి వద్దకు చేర్చాలని పేర్కొన్నారు. ఐరన్ సుక్రోజ్ ఇవ్వడానికి తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ ను తప్పకుండా వినియోగించాలని తెలియచేశారు. ఆశా వర్కర్లు, హెల్త్ వర్కర్స్ వారి క్లస్టర్ పరిధిలో ఉన్న ప్రతీ ఒక్క గర్భిణీ, బాలింత వివరాల, ఆరోగ్య రిపోర్ట్ ప్రకారం చికిత్స, మందులు వాడటం పై అవగాహన కల్పించడం అవసరం అన్నారు. అదే విధంగా నూతన మార్గ దర్శకాలు ప్రకారం ఉచిత టి ఐ ఎఫ్ ఎఫ్ ఏ స్కానింగ్ చేపట్టాలని, సాధారణ గర్భిణీ స్త్రీలందరికీ తప్పని సరిగా రెండు సార్లు స్కాన్‌లు చెయ్యాల్సి ఉంటుందని తెలియచేశారు. ప్రవేటు ఆసుపత్రులలో ఎక్కువ డెలివరీ కేసులు నమోదు అవుతున్న దృష్ట్యా, అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో డెలివరీలకు చొరవ చూపాలని పేర్కొన్నారు. ఆక్రమంలో ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. తద్వారా ఆయా ఆసుపత్రులు ఆర్థికంగా బలోపేతం చేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. మానవతా విలువలు దృక్పథం కలిగి విధులని సమర్థవంతంగాజిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా కె. వేంకటేశ్వర రావు మాట్లాడుతూ, బాలింతలకు హీమోగ్లోబిన్ స్థాయిమెరుగుపరచడానికి ప్రసవానంతర మహిళలకు Ferric Carboxymaltose injection (FCM ) ఇంజెక్షన్ ఇప్పించడం తప్పని సరి అన్నారు . తద్వారా వారిలో రక్తహీనత అరికట్టవచ్చునని , తెలియ చేశారు. తద్వారా బాలింతల మరణాలను పూర్తి స్థాయి లో నివారించడం సాధ్యం అవుతుందని పేర్కొన్నారు.జిల్లా ఆసుపత్రుల సేవల సమన్వయకర్త (DCHS) డా ఎం. సనత్ కుమారి మాట్లాడుతూ, ఎటువంటి మాతృ మరణాలు గర్భిణీ స్త్రీలలో, బాలింతలలో జరగకుండా వైద్య సిబ్బంది తగిన విధంగా మందులు తీసుకునేలా డోర్ టూ డోర్ వెళ్ళే సందర్భంలో వారి ఆరోగ్య స్థితి తెలుసుకోవడం చాలా అవసరం అన్నారు. అప్పుడే వారి ఆరోగ్యం స్థితి గురించి తెలుసుకుని సరియైన పద్ధతిలో చికిత్స అందించ గలుగుతా మన్నారు.ఈకార్యక్రమంలో వైద్యులు, ఆశా వర్కర్లు, ఏ ఎన్ ఎం లు, వైద్య ,ఇతర అనుబంధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News