Breaking News

ఓటర్ల తొలగింపు చేసేందుకు తప్పుడు ధృవీకరణ పత్రం దాఖలు చేసే వారిపై చర్యలు  ఆర్డీవో ఎస్. మల్లి బాబు

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఓటర్ల జాబితా లో అర్హులైన ఓటర్ల పేర్ల ను తొలగించడం కోసం ఉద్దేశ్య పూర్వకంగా తప్పుగా అభ్యంతరం తెలియ చేసినట్లు క్షేత్ర స్థాయి పరిశీలన లో గుర్తించిన యెడల ఆ వ్యక్తిపై 1950 ప్రజా ప్రాతినిధ్యం చట్టం లోని సెక్షన్ 31 కి లోబడి చర్యలు తీసుకోవడం జరుగుతుందని రెవెన్యూ డివిజనల్ అధికారి ఎస్. మల్లి బాబు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.ఓటర్ల తొలగించే నిమిత్తం ఒక వ్యక్తి 5 గురు కి మించిన పేర్లను ఫారం -7 లో సమర్పించిన క్రమంలో సంబంధిత ఈ ఆర్ ఓ క్షేత్ర స్థాయి పరిశీలన చేసి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.ఈ క్రమంలో సదరు పేర్ల ను తొలగించే చర్యల్లో భాగంగా క్షేత్ర స్థాయి లో ముగ్గురు సభ్యులతో కలిసి సహాయ ఈ ఆర్ ఓ, బి ఎల్ వో, డిప్యూటీ తహశీల్దార్ హోదా కలిగిన అధికార సభ్యులు ఆయా తొలగింపు కోసం వచ్చిన ధరఖాస్తులను క్షేత్ర స్థాయి లో పరిశీలించి నిర్ధారణ అనంతరం తొలగించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఆమేరకు తనిఖీ కోసం వెళ్ళే వివరాలను ముందస్తుగా సంబంధిత పోలింగ్ కేంద్రానికి చెందిన అధికార రాజకీయ పార్టీలు నియమించిన బూత్ స్థాయి ఎజెంట్ సమాచారం ఇవ్వడం జరుగుతుందని అన్నారు.ఓటరు గుర్తింపు విషయంపై ఓటు హక్కును తొలగించేందుకు ఉద్దేశ్య పూర్వకంగా సదరు వ్యక్తి తప్పుగా అభ్యంతరం తెలియ చేసినట్లు క్షేత్ర స్థాయి పరిశీలన లో గుర్తించిన యెడల ఆ వ్యక్తిపై 1950 ప్రజా ప్రాతినిధ్యం చట్టం లోని సెక్షన్ 31 కి లోబడి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏడాది వరకు జైలు శిక్ష లేదా అపరాధ రుసుం లేదా రెండు విధించే అవకాశం ఉందని మల్లిబాబు తెలియ చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *