రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
బడిబయట పిల్లలను నూరుశాతం స్కూల్ కి తీసుకుని వొచ్చే క్రమంలో సచివాలయ కార్యదర్శులను పూర్తి స్థాయిలో భాగస్వామ్యం చెయ్యడం జరుగుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ తెలియ చేశారు.గురువారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెలగపూడి కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లతోసుస్థిర ఆరోగ్య, మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి పై, విద్య జీ ఈ ఆర్, హౌసింగ్ , సచివాలయ సేవలు, జీ జి ఎం పి, జగనన్న కు చెబుదాం లపై సమీక్ష నిర్వహించారు.స్థానిక కలెక్టరేట్ నుంచి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ ఇతర అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి కె యస్ జవహర్ రెడ్డి మాట్లాడుతూ, బడి బయట పిల్లలను నూరుశాతం స్కూల్ కు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆక్రమంలో సచివాలయం పరిధిలో విధులు నిర్వర్తించే పదిమంది కార్యదర్శులను కూడా భాగస్వామ్యం చెయ్యాలని ఆదేశించారు.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ మాట్లాడుతూ, గర్భిణీలకు చెంది ఏరియా ఆసుపత్రి లో, సి హెచ్ సి, పి హెచ్ సి లలో డెలివరీ లను మరింతగా చేపట్టడం పై ఇప్పటికే వైద్య అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఆయా ఆసుపత్రుల పడకల ఆధారంగా వైద్య సేవలు లక్ష్యాలను పెంచడం జరుగుతుందని అన్నారు.విద్య పై సమీక్ష చేస్తూ 100 శాతం బడి బయట పిల్లలు స్కూల్ చేర్పించి ఆమేరకు సచివాలయ కార్యదర్శులను కూడా భాగస్వామ్యం చేస్తామని అన్నారు. 6వ తరగతి 27,691 లక్ష్యం కు గాను 27,676 మందిని, 9వ తరగతి లో 27,338 మందికి గానూ 28,116 మందిని, ఇంటర్ లో 20,549 మందికి గానూ 22,314 మంది మేర స్కూల్ లో చేర్పించడం జరిగిందన్నారు. నాడు నేడు కింద 507 స్కూల్స్ రూ.19.20 కోట్ల మేర పనులు చేపట్టడం జరిగిందన్నారు. 433 స్కూల్స్ లో టాయ్లెట్స్, 312 స్కూల్స్ లో కిచెన్, 444 స్కూల్స్ లో మేజర్, మైనర్ నిర్మాణ పనులు, 396 స్కూల్స్ లో మేజర్, మైనర్ మరమ్మత్తు పనులు, 433 స్కూల్స్ లో విద్యుత్ పనులు చేపట్టినట్లు తెలిపారు. ఆమేరకు ఆయా పనులకు చెందిన పరిపాలన ఆమోదం ఇవ్వడం జరిగిందని తెలిపారు.హౌసింగ్ కు చెంది జిల్లాలో 20,337 లక్ష్యం కు గాను 20, 344 నూరు శాతం లక్ష్యం సాధించడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ తెలిపారు. ఆమేరకు ఆయా గృహాలకు నూరు శాతం నీటి సరఫరా, విద్యుత్ కనెక్షన్ లు ఇచ్చినట్లు తెలిపారు.జే కే సి కింద జిల్లాలో మొత్తం 6,677 అర్జీలు రాగా 5,454 పరిష్కారం చేశామని, మిగిలినవి పురోగతి లో ఉన్నట్లు తేజ్ భరత్ పేర్కొన్నారు. ఆగస్ట్ నెలలో మొత్తం 1382 జేకేసి అర్జిలలో 669 పరిష్కారం చేశామని, పునరావృతం అయ్యే అర్జీల విషయంలో ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు.గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా 1495 పనులను గుర్తించి, 1380 పనులకు పరిపాలన ఆమోదం ఇచ్చి, 1297 పనులను ప్రారంభించినట్లు తెలిపారు. జిల్లాలో సచివాలయం పరిధిలో పోస్టుల వివరాలు తెలుపుతూ వార్డు పరిధి లో 2112 గాను 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, గ్రామ సచివాలయంలో 7,366 పోస్టులో 110 పోస్టులు భర్తీ చెయ్యవలసి ఉందని తెలిపారు.ఈ సమావేశంలో డిఆర్వో జీ. నరసింహులు, సిపివో ఏ..ముఖ లింగం, జిల్లా వైద్య అధికారులు డా ఎన్ వసుంధర, డా ఏం. సనత్ కుమారి, జీ జీ హెచ్ సూపరింటండెంట్ డా బి. రమేష్, డి ఈ వో ఎస్. అబ్రహం, ఇంటర్మీడియట్ అధికారి నరసింహ మూర్తి, హౌసింగ్ పీడీ జీ. పరశురాం, డి ఎల్ డి వో పి. వీణ దేవి, వి. శాంత కుమారి, జిల్లా సంక్షేమ అధికారి ఎమ్. సందీప్, ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News