రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
శనివారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నందు గౌరవ జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్ . గంధం సునీత రాజమహేంద్రవరం న్యాయస్థానాల్లోని ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, మసాల్చీలు, న్యాయవాదులు మరియు బీద ప్రజలకు జి.ఎస్.ఎల్ హాస్పిటల్ వారి సహకారంతో క్యాన్సర్ కు సంబంధించిన ఉచిత వైద్య సేవల శిబిరం నిర్వహించారు.ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయకుండా ముందస్తుగా జాగ్రత్త చర్యలు తీసుకోవడం ఉత్తమమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత గారు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికీ వారి శరీరం పట్ల స్పష్టమైన అవగాహన ఉండాలన్నారు. శరీరంలో వస్తున్న మార్పులు, లక్షణాలు గమనించిన వెంటనే వైద్యులను సంప్రదించడం, పరీక్షలు చేయించుకోవడం వల్ల అనేక రుగ్మతల నుండి మొదటిలోనే ఉపశమనం లభిస్తుందని వివరించారు. జి.ఎస్.ఎల్. మ్యానేజింగ్ డైరెక్టర్ మరియు ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు డా.తరుణ్ రొమ్ము, జీర్ణాశయం, ఊపిరి తిత్తులు, నోటి క్యాంసర్లు, వాటి లక్షణాలు మరియు అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలు గురించి పవర్ పాయింట్ ప్రసెంటేషన్ ద్వారా వివరించారు. న్యాయస్థాన సిబ్బంది అందరూ క్యాన్సర్ కి సంబంధిత సందేహాలను వైద్యల సహాయంతో నివృత్తి చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి. కె. ప్రత్యూష కుమారి పేర్కొన్నారు.కార్యక్రమంలో అదనపు జిల్లా న్యాయమూర్తులు, సీనియర్ మరియు జూనియర్ సివిల్ న్యాయమూర్తులు, న్యాయవాదులు, న్యాయస్థానాల్లోని సిబ్బంది, జి.ఎస్.ఎల్. వైద్య బృందం, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News