రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గౌరవ రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో రక్తదాన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.కే. వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.శనివారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన రక్తదాన సేకరణ కార్యక్రమంలో డిఎంహెచ్ ఓ డా. వెంకటేశ్వరారవు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి అనుసంధానంగా రక్తదాన కార్యక్రమాలను జిల్లాలో 8 ప్రాంతాల్లో ఈ నెల 23,24 తేదీల్లో రెండు రోజులు పాటు నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ ఆస్పత్రి, ధన్వంతరి వాలెంటరీ బ్లడ్ బ్యాంక్ సెంటరు, వైయస్సార్ జక్కంపూడి రామ్మోహనరావు బ్లడ్ బ్యాంక్ సెంటరు,సంజీవిని వాలంటరీ బ్లడ్ బ్యాంక్ సెంటరు, స్వతంత్ర బ్లడ్ బ్యాంకు సెంటరు, విజయశ్రీ , బ్లడ్ బ్యాంక్ సెంటరు రాజమహేంద్రవరం నందు, జీఎస్ఎల్ మెడికల్ కళాశాల అండ్ జినరల్ హాస్పటల్ బ్లడ్ బ్యాంక్ నందు రక్తదాన కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ రక్తదాన కార్యక్రమంలో 18 సంవత్సారాలు పైబడి 45 కిలోల బరువున్న ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయవచ్చునని పేర్కొన్నారు. మనం చేసే రక్తదానం ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారి ప్రాణాన్ని నిలబెడుతుందన్నారు. రక్తదాన కార్యక్రమంలో భాగంగా తొలి రోజు 350 రక్త సేకరణలు చేసినట్లు తెలియజేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా వచ్చి రక్తదాన కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేయాలని జిల్లా కలెక్టర్ కె మాధవీలత పిలుపునిచ్చాని పేర్కొన్నారు.ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో భాగంగా స్వచ్చందంగా అవయవ దానాలు చేసేందుకు అంగీకరించిన వారికి వెబ్సైట్ https://notto.abdm.gov.in/ ద్వారా సర్టిఫికెట్స్ కూడా ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఆప్తమాలజిస్ట్ డా. అభిషేక్ సుధీర్,ఇతర వైద్య సిబ్బంది బ్లడ్ బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News