రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
‘‘స్వచ్ఛతాహి సేవ’’, ఇండియన్ స్వచ్ఛ లీగ్ 2.0 కార్యక్రమాలలో భాగంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో రేపు (ది.24-09-2023) ఉదయం గం.7:00 లకు వై జంక్షను నుండి పుష్కరఘాట్ వరకు సైకిల్ తాన్ నిర్వహించనున్నట్లు మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత, విద్యార్ధులు, జెసిఐ సభ్యులు, నగరపాలక సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొంటారు. ఆసక్తి గల యువత, నగర ప్రజలు సైకిల్ తాన్ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసినదిగా కోరడమైనది.
Prajavartha Online Telugu News