Breaking News

నేటి నుంచి 32వ నేష‌న‌ల్ టెన్‌పిన్ బౌలింగ్ ఛాంపియ‌న్‌షిప్

-ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి పాల్గొంటున్న మ‌హిళ స‌హా 8 మంది క్రీడాకారులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజ‌య‌వాడ‌:- ఈ నెల 25 నుంచి 30వ తేదీ వ‌ర‌కు బెంగ‌ళూరులో జ‌రుగుతున్న 32వ నేష‌న‌ల్ టెన్‌పిన్ బౌలింగ్ ఛాంపియ‌న్‌షిప్ (టి.బి.ఎస్‌.ఐ)కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం నుంచి ఒక మ‌హిళ స‌హా 8మంది క్రీడాకారులు పాల్గొంటున్నార‌ని టీబీఎస్ఐ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి దిల్‌బిర్ సింగ్ ఆదివారం ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. టి.బి.ఎస్‌.ఐ.లో పాల్గొంటున్న క్రీడాకారుల్లో వ‌ర్షిత్ గుడివాడ‌, గౌత‌మ్ అభిలాష్ ఊసా, సాయికుమార్ తంగెళ్ళ‌ముడి, ప్ర‌హ్లాద్ అమ‌రా, ప‌వ‌న్ అంబుల‌, షేక్ అబ్ధుల్ ముజీద్‌, ప్ర‌వీణ్ తుంగ‌ల‌, మ‌హిళ‌ల కేట‌గిరిలో సుమ‌తి న‌ల్ల‌బంటు ఉన్నార‌ని ఆయ‌న పేర్కొన్నారు. క్రీడాకారుల్లో మ‌హిళా విభాగం నుంచి హాజ‌ర‌వుతున్న సుమ‌తీ న‌ల్ల‌బంటు ఇప్ప‌టికే మూడుసార్లు నేష‌న‌ల్ ఛాంపియ‌న్‌గా నిలిచార‌ని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *