Breaking News

భిన్న మతాల సమాహారంగా ఎకో స్పేస్ లో వేడుక

-పటమటలో ఘనంగా వినాయక నిమజ్జనం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలోని పటమటలో వినాయక నిమజ్జన వేడుకలు ఘనంగా జరిగాయి. ఆదివారం ఏడవరోజు కావటంతో వివిధ కూడళ్లు, అపార్టుమెంట్ లలో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహాలను మేళతాళాల నడుమ ఘనంగా ఊరేగించారు. ఇక్కడి ఎన్ టి ఆర్ స్ట్రీట్ లోని ఎకో స్పేస్ అపార్ట్ మెంట్ లో చవితి వేడుకల సందర్శంగా ఏర్పాటు చేసిన మట్టి వినాయకుడి విగ్రహానికి వైభవంగా పూజాదికాలు నిర్వహించి నిమజ్జనం పూర్తి చేసారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో అరవై కుటుంబాలకు చెందిన వందలాది మంది పాల్గొన్నారు. కుల మతాలకు అతీతంగా, హిందువులు, క్రిస్టియన్లు, ముస్లింలు ఐక్యంగా ఎకో స్పేస్ లో వేడుకలు నిర్వహించటం విశేషం. ఈ సందర్భంగా నిర్వహించిన స్వామి వారి అన్న సమారాధనకు చిన్న పెద్ద అంతా హాజరై భోజనం స్వీకరించి స్వామి వారి అశ్శీస్సులు పొందారు. గత వారం రోజులుగా స్వామివారికి పూజాదికాలు నిర్వహిస్తూ ప్రసాదంగా ఉంచిన లడ్డూలను వేలం వేయగా స్వామి భక్తులు పోటీలు పడి ఇరవైవేల రూపాలయలకు పాడారు. చివరగా మేళతాళాల నడుమ ఎకో స్పేస్ నుండి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకువెళ్లి యనమలకుదురు సమీపంలోని కాలవలో నిమజ్జనం చేసారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *