Breaking News

ప్రజల ఆరోగ్య పరిరక్షణే ప్రభుత్వ లక్ష్యం…

-జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా మరింత మెరుగైన వైద్య సేవలు.
-జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీరావు.

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించి ప్రతి ఒక్కరు ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలనే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు సూచించారు.జి. కొండూరు మండలం కవులూరు గ్రామంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నిర్వహిస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు ప్రారంభించారు . ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యసేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. ఈ నెల 30వ తేది వరకు నెల రోజులపాటు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక శిబిరాలు నిర్వహించి అవసరమైన వైద్య సహాయం అందిస్తారన్నారు. ప్రభుత్వం ఎన్నడూ లేనివిధంగా ఇంటి వద్దకే వైద్య సిబ్బందితో వచ్చి ప్రజల ఆరోగ్య సమస్యలు తెలుసుకుని మెరుగైన వైద్య సహాయం అందించే జగనన్న ఆరోగ్య సురక్ష పథకం అని అన్నారు. మండలానికి ఒక గ్రామం చొప్పున ప్రతిరోజూ వైద్య శిబిరాలు జరుగుతాయని,ఇద్దరు స్పెషలిస్టు డాక్టర్లు, ఇద్దరు పీహెచ్‌సీ వైద్యులు పాల్గొంటారన్నారు. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు సంబంధించిన ప్రత్యేక వైద్య నిపుణులతో ప్రజలకు మెరుగైన వైద్య సహాయం అందిచడం జరుగుందన్నారు. జిల్లాలోని ప్రతి మండలంలో ఇద్దరు పీహెచ్‌సీ వైద్యులతో పాటు ఫ్యామిలీ డాక్టర్, ఇతర వైద్య సిబ్బంది ఆరోగ్య సురక్ష శిబిరాలలో పాల్గొని ప్రజలకు అవసమైన వైద్య సహాయం అందించేందుకు కృషి చేస్తారన్నారు. 162 రకాల మందులతో పాటు 18 రకాల శస్త్రచికిత్సల వస్తువులు, 14 రకాల ఎమర్జెన్సీ కిట్లు తదితర వైద్య సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ఆరోగ్య సమస్యలున్న వారికి ఈసీజీ వంటి వైద్య పరీక్షలు నిర్వహించి మరింత మెరుగైన వైద్య సహాయం అందించాల్సి వస్తే డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రిఫరల్ ఆసుపత్రిలో పూర్తీ వైద్య సహాయం అందించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. దీర్ఘకాలిక వ్యాధులు, గర్భిణులు, బాలింతలు, తగిన బరువులేని పిల్లలు, క్షయ, కుష్ఠు వ్యాధులతో బాధపడే వారిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని వైద్యాధికారులను ఆదేశించామన్నారు. తొలుత మహిళ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పౌష్టికాహారంపై ఏర్పాటు చేసిన ఆహార పధార్ధాల ఎగ్జిబిషన్ ను జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు సందర్శించారు.కార్యక్రమంలో జిల్లా వైద్యఆరోగ్య శాఖ అధికారిణి డా. యం. సుహాసిని, డిప్యూటీ డియంహెచ్ఓ డా. ఇందుమతి, ఎంపిడివో పి. అనురాధ, సిడిపిఓ కె. పుష్పలత, రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం అధికారి డాక్టర్ మాధవి, డిపియంఓ డా.నవీన్, ఆరోగ్య శ్రీ సమన్వయ అధికారి డా.సుమన్ , వైద్యాధికారి డా. కళ్యాణి, మండలం అధ్యక్షులు వేములకొండ లక్ష్మి తిరుపతమ్మ, సర్పంచ్ కొండ మరియమ్మ, యం.పి.టి.సి తేలప్రోలు తేజ, డొలా మధుబాబు, పిఎసిఎస్ ఛైర్మన్ గోట్టుముక్కల ఓంకార్ బాబు, పంచాయతీ కార్యదర్శి రామచంద్రరావు, అంగన్వాడి సిబ్బంది, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *